అందుకే ఆమెకంత డిమాండ్

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఎప్పడు ఫామ్ ని కోల్పోకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గానే కొనసాగుతుంది. యువ హీరోలతో జోడి కట్టినా.. సీనియర్ హీరోలతో జోడి కట్టినా… లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించినా నయనతార గ్రాఫ్ మాత్రం పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం లేదు. ఆమె సినిమాలకు మార్కెట్ లో ఎపుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటూ స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం అందుకుంటున్న నయనతార తాజాగా కొలమావు కోకిల సినిమాతో కోలీవుడ్ లో అదరగొట్టే హిట్ సొంతం చేసుకుంది.

ఈ నెల 17 న థియేటర్స్ లోకొచ్చిన కొలమావు కోకిల సినిమా తమిళనాట విజయదుందుభి మోగించింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కొలమావు కోకిల థియేటర్స్ దుమ్ము దులుపుతుంది. కొలమావు కోకిల గా నయనతార నటనకు అందరూ నీరాజనాలు పడుతున్నారు. ఈ సినిమాలో నయనతార కేన్సర్ తో బాధపడుతోన్న తన తల్లికి ట్రీట్‌మెంట్ ఇప్పించడం కోసం డ్రగ్స్ మాఫియాతో చేతులుకలిపి డ్రగ్స్ ని సప్లై చేసే అమ్మాయి పాత్రను పోషించింది. అయితే ఆ డ్రగ్స్‌ను సప్లయ్ చేసే రోల్‌లో నయనతార అద్భుతమైన నటనను కనబర్చడం వలనే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందని.. సినిమా విజయంలో నయనతార పాత్ర కీలకమంటున్నారు.

అసలు సినిమాని ఒంటి చేత్తో… వన్ మ్యాన్ ఆర్మీలా నయనతార వన్ మ్యాన్ షో చేసిందంటున్నారు. ఇక నయనతార ఈ సినిమాతో కేవలం మూడు రోజుల్లోనే 11.50 కోట్లు కొల్లగొట్టింది… ఒక్క ఆదివారం రోజునే ఈ సినిమా కోలీవుడ్ లో 4 కోట్లు తెచ్చిందని అంటున్నారు. మరి సోమవారం కూడా కొలమావు కోకిల మంచి కలెక్షన్స్ రాబట్టిందనే టాక్ నడుస్తుంది. తమిళంలో అంత హిట్ అయిన సినిమాని తెలుగులో కూడా కోకో కోకిల టైటిల్ తో విడుదల చేసే ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారు. నయనతార గత చిత్రం కర్తవ్యం కూడా అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను మంచి విజయం సాధించడం.. ఇప్పుడు కొలమావు కోకిల కూడా హిట్ అవడంతో.. నయనతార డిమాండ్ ఇంకా ఇంకా పెరగడమే కానీ.. తరగదంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1