నయన్ తో పెళ్లి గురించి నోరు విప్పిన విగ్నేష్ శివన్

నయనతార రామాయణం

తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార..డైరెక్టర్ విగ్నేష్ శివన్ చాలా రోజులు నుండి ప్రేమలో ఉన్నారని అందరికి తెలిసిన విషయం. ఏ ఫంక్షన్ కి వెళ్లినా..ఏ ఈవెంట్ కి వెళ్లినా..ఎక్కడకి వెళ్లిన ఇద్దరు కలిసే వెళ్తున్నారు. దాంతో అందరికి వీరు డీప్ లవ్ లో ఉన్నారని అర్ధం అయింది. ఇక రీసెంట్ గా వీరిద్దరూ కలిసి అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొదట శింబు తో కొన్నాళ్లు రిలేషన్ లో ఉన్న నయన్ ఆ తర్వాత ప్రభుదేవా తో కూడా కొన్నాళ్లు లవ్ జర్నీ సాగించింది. మరి ఏమైందో ఏమిటో ప్రభుదేవాతో బ్రేక్ అప్ చెప్పి విగ్నేష్ శివన్ ను లవ్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే వీరిద్దరి లవ్ గురించి అందరికి తెలియడంతో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో విగ్నేష్ శివన్ ను పెళ్లి గురించి ప్రశ్నించగా నా చేతుల్లో లేదు. ముందు నయన్ ని అడిగాలి అని అన్నాడు.

మా అమ్మని అడిగిన తర్వాత నా పెళ్లి గురించి చెబుతాను అని ఆయన చెప్పారు. మరి ఆ వారిద్దరి నుండి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు బయటికి వస్తుందో? ప్రస్తుతం నయన్ అజిత్ తో ‘విశ్వాసం’ అలాగే మెగాస్టార్ చిరంజీవి తో ‘సైరా’ సినిమాల్లో నటిస్తుంది. ఇక తన ప్రియుడు విగ్నేష్ శివన్ సూర్యతో ‘థానా సెర్ధా కూటమ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో విడుదలైన ఈచిత్రం తమిళంలో, తెలుగులో మంచి టాక్ దక్కించుకుంది. ఈసినిమా తర్వాత విగ్నేష్ ఇంత వరకు తన నెక్స్ట్ మూవీ ఏంటో ప్రకటించలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*