అలా నయనతార ప్లేస్ లోకి కాజల్ వచ్చిందా..?

తమిళంలో దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘తని ఒరువన్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ కొట్టి సూపర్ కలెక్షన్స్ తెచ్చుకోవడంతో… తెలుగులో సురేందర్ రెడ్డి రామ్ చరణ్ హీరోగా రీమేక్ గా ‘ధ్రువ’ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టాడు. తమిళ ‘తని ఒరువన్’ లో జయం రవి హీరో, నయనతార హీరోయిన్, అరవింద స్వామి విలన్. తెలుగులో రామ్ చరణ్ హీరో, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్, తమిళంలో నటించిన అరవింద్ స్వామి తెలుగులోనూ విలన్ గా దుమ్మురేపాడు. మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో అదరగొట్టే ట్విస్టులతో సినిమా సూపర్ హిట్ అవడంతో.. ‘తని ఒరువన్’ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి సీక్వెల్ చెయ్యాలని తలపెట్టడమే కాదు… అధికారికంగా ప్రకటించాడు కూడా.

నయనతారను పక్కనపెట్టి…

మోహన్ రాజా మళ్లీ తన తమ్ముడు జయం రవితో ‘తని ఒరువన్ 2’ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇప్పటికే ‘తని ఒరువన్ 2’ స్క్రిప్ట్ మీద మోహన్ రాజా కూర్చున్నట్లుగా తెలుస్తుంది. ఇక స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసి ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో జయం రవి హీరోగా పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఉండగా… ‘తని ఒరువన్’ లో హీరోయిన్ గా నటించిన నయనతార ని కాదని కాజల్ అగర్వాల్ ని తీసుకుంటున్నట్లుగా సమాచారం. ‘తని ఒరువన్’ లో నయనతార సినిమాకి గ్లామర్ తో, జయం రవికి తోడుగా ఉండే కేరెక్టర్ లో ఇరగ దియ్యడం… నయనతార హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో ఉండడం సినిమా విజయానికి తోట్పాడింది.

డిమాండ్ బాగా పెరిగిపోవడంతో…

అయితే ఇపుడు ‘తని ఒరువన్’ సీక్వెల్ లో నయనతారను తప్పించి ఆ ప్లెస్ లోకి కాజల్ ని తీసుకోబోతున్నారని కోలీవడ్ మీడియా కోడై కూస్తుంది. అయితే నయనతారని మళ్లీ తీసుకోకపోవడానికి కారణం మాత్రం నయనతార డిమాండ్ చేసిన పారితోషకానికి కళ్ళు బైర్లు కమ్మిన నిర్మాతలు కాజల్ ని సంప్రదిస్తున్నారట. అలాగే ప్రస్తుతం నయనతారకు కోలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉండడం.. స్టార్ హీరోలతో పోటీపడి పారితోషకం అందుకోవడం, అలాగే లేడి ఓరియెంటెడ్ మూవీస్ తో చెలరేగి పోవడంతో… నయనతారని మళ్లీ ‘తని ఒరువన్’ సీక్వెల్ లో కొనసాగిస్తే.. జయం రవిని డామినేట్ చేస్తుందనే ఉద్దేశంతోనే నయనతారని తప్పించినట్లుగా తెలుస్తుంది. ఇక గ్లామర్ పరంగా, నటనపరంగా జయం రవికి కాజల్ పక్కాగా సూట్ అవడంతో కాజల్ ని హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*