కమల్ కి నయన్!

కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలించింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో నటించారు. ఇప్పటికీ ఆ సినిమా అంటే పడి చచ్చిపోయేవారు చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ‘గీత గోవిందం’ సినిమాలో కూడా ‘భారతీయుడు’ రిఫరెన్స్ ఉంటుంది. అలాంటి ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కించనున్నారని తెలిసిందే.

కడపలో షూటింగ్..?

దీనికి ‘భారతీయుడు – 2’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఆఫిషల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీక్వెల్ లో కూడా కమల్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ ‘2.o’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే మరోపక్క ఈ సినిమాకు సంబంధించి పనులు కూడా చూసుకుంటున్నారు. అందుకుగాను శంకర్ ఆంధ్రప్రదేశ్ లోని కడపలో ఒక లొకేషన్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

హీరోయిన్ గా నయనతార…

ఇందులో కమల్ తో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటిచనున్నాడు. ప్రముఖ నిర్మాత ఎం.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా తీసుకొనునున్నారని సమాచారం. మరి ఇది ‘భారతీయుడు’ను తలదన్నేలా ఉంటుందా..? లేదా..? చూడాలి. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*