పెళ్లి కాకుండా ఏంటీ పనులు..!

తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార తరుచూ ఎదోరకంగా వార్తల్లో ఉంటూనే ఉంటుంది. అయితే మరోసారి ఈమె వార్తల్లోకి ఎక్కింది. దీపావళి సందర్భంగా నయనతార పెట్టిన ఫోటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తన బాయ్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ విఘ్నేష్‌తో కలిసి ఓ ఫోటోను పెట్టింది. అందులో ఏముంది వీరిద్దరూ ఎప్పటి నుండో స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ కదా? అని అనుకోవచ్చు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో నయన్ ఇద్ద‌రితో ప్రేమ‌ వ్య‌వ‌హారం న‌డిపి పెళ్లి దాకా వ‌చ్చి బ్రేక్ అప్ అయిన సంగ‌తి తెలిసిందే.

లవర్ తో కలిసి దీపావళి…

మొదట హీరో శింబుతో కొన్నాళ్లు లవ్ ట్రాక్ ను నడిపిన నయన్ కొన్ని కారణాలతో శింబుకు బ్రేక్ అప్ చెప్పి ప్ర‌భుదేవ‌తో ప్రేమాయ‌ణం స్టార్ట్ చేసింది. వీరిది ఆల్‌మోస్ట్ పెళ్లి దాకా వ‌చ్చి బ్రేక్ అయ్యింది. ఆ తరువాత ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌తో కొత్త జ‌ర్నీ స్టార్ట్ చేసింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే కాపురం పెట్టేశార‌ని కోలీవుడ్‌లో గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఆ పుకారుకి బలం చేకూరుస్తూ.. మొన్న దీపావళి పండగ రోజున ఇద్దరు కలిసిన ఫోటోను పెట్టింది. ఇందులో నయన్ త‌న ల‌వ‌ర్‌ని గ‌ట్టిగా హ‌గ్ చేసుకుని ఒక ఫొటో దిగి సోష‌ల్ మీడియాలో పెట్టింది. దాంతో కోలీవుడ్ మొత్తం నయన్ పెళ్లి కాకుండానే కాపురం పెట్టేసింద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*