ఏంటి బాబు ఇలా చేశావ్?

కరెక్ట్ ఇదే రోజున గత ఏడాది నాగ చైతన్య – రకుల్ నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల అప్పటికే నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’ తీశాడు. అది పెద్ద హిట్ అయింది కానీ ఆయనకు పేరు రాలేదు. సినిమాలో నటించిన నాగార్జున.. రమ్య కృష్ణ.. ఇక రచయితలు సత్యానంద్, సాయిమాధవ్ బుర్రాల కృషి వల్లే సినిమా హిట్ అయిందనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి.

ఎలాగైనా తన రెండో సినిమాతో తానేంటో రుజువు చేసుకోవాలని నాగ చైతన్యని పెట్టి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా తీసి హిట్ కొట్టాడు కళ్యాణ్ కృష్ణ. ఈ సినిమా హిట్ అవ్వడంతో కళ్యాణ్‌కు మంచి పేరు వచ్చింది. నాగచైతన్యకు సోలో హీరోగా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందా చిత్రం. మళ్లీ కరెక్ట్ గా అదే సమయానికి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో రవితేజ హీరోగా ‘నేల టిక్కెట్టు’ విడుదల అయింది.

కానీ సినిమా మాత్రం అందరి అంచనాలు తలకింద చేస్తూ బోల్తాకొట్టింది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోస్ సినిమాల్లో రవితేజ ‘నేల టిక్కెట్టు’ కు వచ్చిన పేలవమైన టాక్ ఇంకే సినిమాకి రాలేదు. రవితేజ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఇదొకటిగా పేరు తెచ్చుకుంటోంది. తన గత రెండు సినిమాలతో హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ ఇలాంటి సినిమా తీస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. అటు రవితేజ పరిస్థితి కూడా అంతగా ఏమి బాగుండలేదు. అతని గత రెండు చిత్రాలు ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’ సినిమాలు ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*