ఈ సినిమాకి మరీ ఇంత రెమ్యూనరేషనా..?

రాజా ది గ్రేట్ తో మళ్ళీ ఫామ్ లోకి దూసుకొచ్చిన రవితేజ కి టచ్ చేసి చూడు సినిమా ఫ్లాప్ అయినా రవితేజ క్రేజ్ తో నేలటిక్కెట్టు నిర్మాతలు మళ్లీ ఒక మాదిరి బడ్జెట్ తో సినిమాని నిర్మించారు. రెండు సినిమాల హిట్స్ తో ఉన్న కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడతాడని నిర్మాతలు ఈ సినిమాకి పెట్టుబడి పెట్టారు. కానీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేలటిక్కెట్టు ప్రేక్షకులను నెల నాకించేసింది. సినిమాలో రవితేజ చెప్పిన నేల నాకించేస్తా అనే డైలాగ్ లాగానే నేల టిక్కెట్టు నిర్మాతలు కూడా నేల నాకడానికి రెడీ అవుతున్నారు.

మరీ అంతా..

సినిమాలో విషయం లేకపోవడంతో.. ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. కళ్యాణ్ కృష్ణ  ఫ్యామిలీ అండ్ కామెడీ సినిమా లు హ్యాండిల్ చేసినట్టుగా మాస్ కథను హ్యాండిల్ చెయ్యలేకపోయాడు. ఫలితంగా నేల టిక్కెట్టు సినిమా ఫ్లాప్ అయ్యింది. రవితేజ ఎనర్జీతోనే సినిమాని నడిపించ గల సత్తా ఉన్నోడు. కానీ రవితేజ క్యారెక్టర్ ని కూడా కళ్యాణ్ కృష్ణ అంత బాగా ప్రెజెంట్ చెయ్యలేకపోయాడు. అందుకే రవితేజ కూడా ఏం చెయ్యలేకపోయాడు. అయితే ఈ సినిమాకి రవితేజ అక్షరాలా 12 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నాడనే టాక్ వినబడుతుంది.

కొంత తిరిగిస్తాడా..?

రవితేజ నేల టిక్కెట్టు సినిమా కథని ఎలా విన్నాడు, అసలా సినిమా ఎలా చేసాడు ? కథల మీద మాస్ మహారాజ్ దృష్టి పెట్టాలి.. ఇలాంటి సినిమా కి 12 కోట్ల పారితోషకమా? అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు నేలటిక్కట్టుకి రవితేజ అందుకున్న రెమ్యునరేషన్ 12 కోట్లు రవితేజ కెరీర్ లోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ కింద జనాలు చెప్పుకోవడం చూస్తుంటే… ఫ్లాప్ సినిమాకి 12 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకున్న రవితేజ అంటూ సెటైర్స్ వేస్తున్నారు. మరి  నిర్మాతలకు ఈ సినిమాతో భారీ లాస్ వచ్చినట్టే. తాను అందుకున్న అమౌంట్ లో కొంత వెనక్కి ఇచ్చేస్తే నిర్మతలు సేఫ్ అవుతారు. కానీ రవితేజ అలా చేస్తాడా? అంటే డౌటే అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*