ఆర్ఎక్స్ బ్యూటీ ఆ…అవకాశం పట్టిందా..!

ఆర్ఎక్స్ 100 సినిమా హిట్ అవడానికి ప్రధాన కారణం ఆ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజపుట్. నెగెటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయిగా హీరో కార్తికేయని మోసం చేస్తూ తన కామ కోర్కెలు తీర్చుకునే అమ్మాయిగా పాయల్ రాజపుట్ నటనకు అందరూ మెచ్చేసారు. ఇంకేంటి ఈ అమ్మాయి టాలీవుడ్ లో బిజీ అవుతుంది అనుకున్నారు. అయితే పాయల్ కి మళ్లీ RX సినిమాలోని పాత్రల వంటి పాత్రలే రావడంతో ఆమె సినిమాలను రిజెక్ట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. మరి అది నిజమో కాదో అనేది తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం పాయల్ రాజపుట్ కి తెలుగులో ఒక యంగ్ హీరో పక్కన సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది.

రెండు సినిమాల్లోనూ కాజల్…

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పాయల్ రాజపుట్ కి ఒక ఛాన్స్ వచ్చిందని సోషల్ మీడియాలో వినబడుతుంది. రేపు సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత ఒకేసారి రెండు ప్రాజెక్టులలో కమిట్ అయ్యాడు. ఒకటి డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వంలో, మరొకటి దర్శకుడు తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఆ రెండు సినిమాల్లోనూ బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడిగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఒక సినిమాలో భారీ పారితోషకం ఆమెకు దక్కుతుండగా.. మరొకటి అంటే తేజ డైరెక్షన్ లో నటించబోయే అ సినిమాలో హీరోయిన్ పాత్రకి హీరో పాత్ర కంటే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి.

పాత్ర నచ్చి ఒప్పేసుకుంది…

అయితే శ్రీనివాస్ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న సినిమా లో మెయిన్ హీరోయిన్ గా కాజల్ కాగా రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. అందుకే ఆ పాత్ర కోసమే RX బ్యూటీ పాయల్ రాజపుట్ ని సంప్రదించినట్లుగా తెలుస్తుంది. ఇక తన పాత్ర తీరుతెన్నులు నచ్చిన పాయల్ రాజపుట్ ఆ ఆఫర్ ని ఒప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి సెకండ్ హీరోయిన్ అయినా పాత్ర ప్రాధాన్యం ఉంటే.. ఆటోమాటిక్ గా వారికి మంచి పేరొస్తుంది. అందుకే పాయల్ రాజపుట్ సెకండ్ హీరోయిన్ పాత్రకి ఒప్పుకుందన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*