మెగా బ్యూటీ బాగుందే..!

మెగా డాటర్ నిహారిక కొణిదెల అసలు హీరోయిన్ అవుదామనుకోలేదట. కానీ హీరోయిన్ అయ్యింది. మీడియం బడ్జెట్ హీరోలతో జోడి కడుతున్న నిహారిక తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్ రేపు శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సినిమా విడుదలకు ముందే హీరో సుమంత్ అశ్విన్ తో కలిసి హ్యాపీ వెడ్డింగ్ ప్రమోషన్స్ కోసం ఊరూరా తిరుగుతూ అందరినీ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. అయితే మెగా ఫ్యామిలీ నుండి హీరోలు రావడమే గాని.. హీరోయిన్ గా మాత్రం నిహారిక మాత్రమే వచ్చింది. అందుకే ఆమె ఎడా పెడా ఏది పడితే ఆ సినిమా చెయ్యకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. ఇక హ్యాపీ వెడ్డింగ్ ప్రమోషన్స్ లో భాగంగా తాను సై రా సినిమా లోని చిన్న పాత్ర కోసం తన అన్న రామ్ చరణ్ కాళ్లు పట్టుకున్నానని.. ఫన్నీ కెమెంట్స్ చేసిన నిహారిక నిజంగానే సై రా సినిమా లో ఒక గిరిజన యువతిగా రెండు సీన్స్ లో నటించబోతుంది.

గ్లామర్ పాత్రల జోలికి పోకుండా

అలాగే నిహారిక నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని.. ఇక పెళ్లయ్యాక సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యడం మానేస్తానని చెబుతున్న ఈ చిన్నది సినిమారంగానికి దూరం కానని చెబుతుంది. సినిమాల్లో నటించకపోయినా.. ప్రొడక్షన్ వైపు వెళతానని. అలాగే వెబ్ సీరీస్ చేసుకుంటానని చెబుతుంది. ఇక నిహారికని చూస్తుంటే మెచ్యూర్డ్ గర్ల్ గా కనబడుతుంది. అలాగే ఆమెలో హీరోయిన్ కు ఉండాల్సిన అందం, అభినయం అన్నీ ఉన్నాయి. పై ఫోటోనే చూడండి.. నిహారిక లో ఎంత బ్యూటీ దాగుందో. మరి గ్లామర్ జోలికి వెళ్లకుండా కేవలం ట్రెడిషనల్ పాత్రలకే పరిమితమవుతున్న ఈ మెగా డాటర్ గ్లామర్ ని కూడా టచ్ చేస్తే ఎమన్నా స్టార్ హీరోల ఛాన్స్ లు వస్తాయేమో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*