ఆ హీరోయిన్ తో నితిన్ వివాహం..?

nithin next film title

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లో నితిన్ ఒక్కడు. తన కెరీర్ స్టార్టింగ్ లో సక్సెస్ చూసిన నితిన్ ఆ తర్వాత వరస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న టైంలో విక్రమ్ కుమార్ ‘ఇష్క్’ సినిమాతో పైకి లేపాడు. అప్పుటి నుండి పర్లేదు అనిపించుకుంటున్న టైంలో ‘లై’, ‘చల్ మోహన రంగ’ సినిమాలు నిరాశకు గురిచేశాయి. ప్రస్తుతం అతని హోప్స్ మొత్తం వేగేష్న‌ స‌తీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ సినిమాపైనే ఉన్నాయి.

హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడా..?

అయితే మరి ఈ సినిమా తర్వాత నితిన్ పెళ్లి చేసుకుంటాడా..? లేదా..? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. `శ్రీ‌నివాస క‌ళ్యాణం` ముందు.. ఆ తర్వాత.. నితిన్ ప్ర‌వర్త‌న‌లో ఎంతో మార్పు వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ఈ సినిమాకు ముందు నితిన్ ప్రేమలో ఉన్నాడని.. ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటాడని చెప్పుకుంటున్నారు. త‌న‌తో వ‌రుస‌గా రెండు సినిమాల్లో న‌టించిన మేఘ ఆకాష్‌తో డీప్‌ ల‌వ్‌లో ఉన్నాడ‌ని, తొంద‌ర్లోనే పెళ్లాడేస్తాడ‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

అప్పుడైనా క్లారిటీ ఇస్తాడా..?

మేఘ ఆకాష్‌ తన ఇంట్లో అడగగా..ఓ ఏడాది పాటు ఆగాక ఇంకా ప్రేమ‌లోనే ఉంటే పెళ్లికి అంగీక‌రిస్తామ‌ని చెప్పారంట. మరి ఇప్పుడు ఈ ప్రేమకథ ఎంతవరకు వచ్చిందో? అంటూ ఒక‌టే ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారంతా. మరి ప్రశ్నలు అన్నిటికీ నితిన్ ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ సినిమా ప్రమోషన్స్ టైంలో స‌మాధానం ఇస్తాడా ? లేదా ? అన్న విషయంపై క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*