యు-టర్న్ తర్వాత పరిస్థితి ఏమిటమ్మా?

Oh Baby ఓ బేబీ

పెళ్లి తర్వాత హీరోయిన్ పనైపోయింది అన్న నోళ్ళని మూడు సినిమాల హిట్స్ తో మూపించింది అక్కినేని సమంత. ఈ ఏడాది హ్యాట్రిక్ కొట్టిన సమంత తన నాలుగో సినిమాని కూడా ప్రేక్షకుల ముందు కు తేవడానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటుంది. రంగస్థలం లో రామలక్ష్మి లా పల్లెటూరి పొలం పనులు చేసుకునే తెలివైనా అమ్మాయిలా అందరిని పడగొట్టేసిన సమంత… మహానటిలో కూడా మధురవాణిగా అంటే జర్నలిస్ట్ పాత్రలో సావిత్రి కథను రివీల్ చేస్తూ పోయే పాత్రలో అదరగొట్టేసింది. ఇక ముచ్చటగా మూడో సినిమా కోలీవుడ్ లో నటించిన…. తెలుగులోనూ అభిమన్యుడుగా విడుదలై తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. దెబ్బకి దిమ్మతిరిగే హిట్స్ సాధించిన సమంత తాజాగా తనకిష్టమైన యు-టర్న్ సినిమాలో లీడ్ రోల్ అంటే అందులోను మహానటి వలే జర్నలిస్ట్ రోల్ చేస్తుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి చివరి దశకు చేరుకుంది. నిన్నగాక మొన్న ఈ సినిమా కి సమంత డబ్బింగ్ చెప్పినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. మరి యు-టర్న్ తర్వాత సమంత చేతిలో ఎలాంటి టాలీవుడ్ మూవీ లేదు. కేవలం తమిళంలో రెండు సినిమాల్తో కాస్త బిజీగా వుంది. ఆ కోలీవుడ్ సినిమాల షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసాయి. ఇక ఆ సినిమాలు కూడా విడుదలైతే సమంత మొత్తంగా ఫ్రీ అవుతుంది. పెళ్లయ్యాక కూడా తీరిక లేకుండా సినిమాల్లో నటిస్తున్న సమంత కెరీర్ లోను బాగానే సక్సెస్ అయ్యింది.

కానీ ఈ సినిమాల తర్వాత సమంత కి ఏ ఒక్క ఆఫర్ కూడా లేదు. ప్రస్తుతం స్టార్ హీరోస్ అంతా అంటే ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లు పూజ హెగ్డే ని తమ సినిమాల్లోకి హీరోయిన్ గా తీసుకుని సెట్స్ మీదకెళ్ళిపోతున్నారు. మరో పక్క ఏ దర్శక నిర్మాత కూడా సమంత ని సంప్రదించినట్లుగా వార్తలు రావడం లేదు. మరి సమంత కి యు- టర్న్ తర్వాత సినిమాలేమి లేవు. ఇటు టాలీవుడ్ లో గాని అటు కోలీవుడ్ లో గాని సమంత కి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డే, కైరా అద్వానీల హావా నడుస్తుండగా.. మెల్లగా మహానటి తో కీర్తి కూడా ఒక మెట్టు ఎక్కేసింది. మరి సమంతకి టాలీవుడ్ లో మొండిచెయ్యేనేమో.. అనే కామెంట్స్ సోషల్ మీడియాలో పడుతున్నాయి. ఇక సమంతకి మిగిలిన ఆప్షన్ కోలీవుడ్ అంటున్నారు. చూద్దాం కోలీవుడ్ లో అయినా సమంత పరిస్థితి ఏమిటనేది. పాపం సమంత వరుసగా సినిమాలు హిట్ అయినా… ఏం లాభం లేకుండా పోయింది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*