ఎట్టకేలకు నోటా రిలీజ్ డేట్ ఫిక్స్

నోటా విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న నోటాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. విజ‌య్ దేవ‌రకొండకు ఇది తొలి ద్విభాషా చిత్రం. తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కానుంది ఈ చిత్రం. త‌మిళ్ వ‌ర్ష‌న్ లోనూ విజ‌య్ సొంత డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. మెహరీన్ కౌర్ ఈ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. శాంత‌న కృష్ణ‌ణ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

Sandeep
About Sandeep 6714 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*