నోటా రిలీజ్ ఎప్పుడో మీరే చెప్పండి: విజయ్

injury to vijay devarakonda

‘అర్జున్ రెడ్డి’ , ‘గీత గోవిందం’ సినిమాలతో బ్లాక్ బాస్టర్స్ ని అందుకున్న విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘నోటా’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో ఇప్పటి నుండే అంచనాలు ఏర్పడ్డాయి. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రాబోతుందని ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఇంకా ముందే రావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ముందు రావాలని ఫిక్స్ అయ్యారు కానీ.. ఏ రోజున వస్తే బాగుంటుందని ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు టీం. ఈ నేపథ్యంలో విజయ్ తన ట్విట్టర్ వేదికగా తన సినిమా విడుదల తేదీని తెలపండి అంటూ అక్టోబర్ 5 లేదా 10 లేదా 18న ఈ మూడు డేట్స్ లో ఏ డేట్ నా ‘నోటా’ సినిమా రిలీజ్ చేస్తే బెటర్ అని డైరెక్ట్ గా ప్రేక్షకులకు పోల్ ని నిర్వహిస్తున్నాడు. అయితే మెజారిటీ పీపుల్ అక్టోబర్ 5న సినిమా రిలీజ్ చేయాలనీ తమ అభిప్రాయాన్ని పోల్ ద్వారా చెప్పారు.

దసరాకు వద్దని ఒత్తిడి…

అయితే ‘నోటా’ రిలీజ్ కోసం విజయ్ ట్విట్టర్ లో పోల్ నిర్వహించడానికి మరో కారణం కూడా ఉంది. ఈ మూవీని దసరా కానుకగా రిలీజ్ చేయొద్దని కొంతమంది ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఒత్తిడి వచ్చిందంట. దీంతో అప్సెట్ అయిన విజయ్ ఆలా ట్విట్టర్ లో పోల్ పెట్టాడని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో ట్విట్టర్ పోల్ ద్వారా `నోటా` రిలీజ్ డేట్ ను విజయ్ నిర్ణయించబోతున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*