‘నోటా’ సినిమా స్టోరీ ఇదే..!

‘గీత గోవిందం’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ అప్పుడే తన నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టాడు. పెట్టడమే కాదు ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. ‘గీత గోవిందం’తో 100 కోట్ల క్లబ్ లో చేరిన విజయ్ అదే ఊపుతో ‘నోటా’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు. అయితే ట్రైలర్ ఎలా ఉండబోతుందో అన్నట్టు నిన్న సాయంత్రం ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. ఆ చిన్న వీడియో చూస్తే స్టోరీ ఏంటో ఇట్టే అర్ధం అయిపోతుంది. ఇందులో విజయ్ రౌడీ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఓ యువకుడిగా కనిపించనున్నాడు. రౌడీ అంటే మీరు అనుకునే గూండాగిరి రౌడీ కాదు. విజయ్ తన అభిమానులు ముద్దుగా ఆలా పిలుచుకుంటారు కాబట్టి ఆ వీడియోలో ఆలా వేశారు.

సీఎంగా కనిపిస్తాడా..?

వీడియోలో విజయ్ పబ్బుల్లో అమ్మాయిలతో డాన్సులు వేస్తూ మంచి జల్సా పురుషుడిగా కనిపిస్తూనే సడన్ గా పొలిటికల్ లీడర్ గా చూపిస్తారు. అతను ఆలా సడన్ గా పొలిటికల్ లీడర్ ఎలా మారాడు.. సీఎం ఎలా అయ్యాడు అనేదే సినిమా కథ. చిన్న వీడియోలోనే ఇన్ని డీటెయిల్స్ ఉంటె ట్రైలర్ ఇంకెన్ని ఉంటాయో? తమిళ డైరెక్టర్ అనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహరీన్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. నిన్న విడుదల వీడియోను స్నీక్‌ పీక్‌ పేరుతో రిలీజ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*