అది 14 నిమిషాల సీనంట‌.. అరుపులే ఇక‌!

ఎన్టీఆర్ `అరవింద స‌మేత‌` గురించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విషయం బ‌య‌టికొచ్చింది. సినిమాలో ఆయ‌న సిక్స్‌ ప్యాక్ బాడీని ప్ర‌ద‌ర్శిస్తూ ఓ ఫైట్ స‌న్నివేశం చేస్తాడు. అది పోస్ట‌ర్ల‌లోనూ, మొన్న విడుద‌లైన టీజ‌ర్‌లోనూ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ నేప‌థ్యంతో కూడిన ఫైట్ తెర‌పై 14 నిమిషాలు ఉంటుంద‌ట‌. దాన్ని డిజైన్ చేసిన విధాన‌మే ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ట‌. ఆ ఫైట్ సీక్వెన్స్ ప్రేక్ష‌కుల‌తో అరుపులు పెట్టించడం ఖాయ‌మ‌ని మాట్లాడుకుంటున్నాయి ఇండ‌స్ట్రీ ఇన్‌సైడ్ వ‌ర్గాలు. ఇక ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్‌లాగా చొక్కాలు విప్పి హంగామా చేయ‌డం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు. త్రివిక్ర‌మ్ సినిమాల్లో ఫైట్ కూడా క‌థ‌లో భాగంగానే వ‌స్తుంటుంది. అందులో కూడా బోలెడంత వినోదం ఉంటుంది. ఈ సినిమాలో ఆ విష‌యంపై మ‌రిన్ని క‌స‌ర‌త్తులు చేసి ఫైట్లు తీర్చిదిద్దిన‌ట్టు స‌మాచారం.

త్రివిక్రమ్ పంచ్ లు ఉంటాయా..?

అందులో మొద‌ట ఇన్‌స‌ర్ట్ చేసుకొని క‌నిపించే ఎన్టీఆర్‌, క్ర‌మంగా చొక్కా వ‌దిలిపెట్టి ప్ర‌తినాయ‌కుల్ని ప‌రుగులు పెట్టించే వ‌ర‌కు వెళుతుంద‌ట‌. ఏక‌ధాటిగా 14 నిమిషాల పాటు సాగే ఆ ఫైట్ సీక్వెన్స్ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంద‌ని స‌మాచారం. సినిమా ఎలా ఉంటుందో టీజ‌ర్‌తోనే స్ప‌ష్ట‌మైంది. త్రివిక్ర‌మ్ సినిమాల్లో పంచ్‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యం కాబ‌ట్టి, ఎన్టీఆర్ కూడా త్రివిక్ర‌మ్ స్టైల్‌లోకి మోల్డ్ అయ్యుంటాడ‌నుకొన్నారంతా. కానీ త్రివిక్ర‌మ్… ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ నీ, ఆయ‌న ఇమేజ్‌నీ దృష్టిలో పెట్టుకొని సినిమాని తీర్చిదిద్దుతున్న‌ట్టు టీజ‌ర్‌ని బ‌ట్టి స్‌లష్ట‌మ‌వుతోంది. కానీ త్రివిక్ర‌మ్ శైలి పంచ్‌ల‌కి కూడా సినిమాలో చోటుంద‌ని, అవి ప్రేక్ష‌కుల‌కు బోన‌స్ కాబోతున్నాయ‌ని సినిమా వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మొత్తంగా సినిమాలో ప్ర‌త్యేక‌మైన అంశాలు బాగానే ప్లాన్ చేసిన‌ట్టున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*