ఈ దర్శకుడికి ఇది చాలా రేర్ రికార్డే

director krish next film

చారిత్రాత్మక చిత్రాల దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరుంది. గతంలో బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టిన దర్శకుడు క్రిష్ బాలీవుడ్ లో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రపై మణికర్ణిక సినిమా ని కంగనా హీరోయిన్ గా చేసాడు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బాగా బిజీగా వుంది. తాజాగా క్రిష్ మరో చారిత్రాత్మక బయో పిక్ కి శ్రీకారం చుట్టాడు. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయో పిక్ ని మొదలు పెట్టడమే కాదు.. శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ లో మణికర్ణిక సినిమాని క్రిష్ ఈ ఆగష్టు 15 కి విడుదల చెయ్యాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆ సినిమా జనవరి 25 న రిపబ్లిక్ డే కి పోస్ట్ పోన్ అయ్యింది.

మరి తెలుగులో క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ బయో పిక్ కూడా ఈ ఐదు నెలల గ్యాప్ లో షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల తేదీ ఖరారు చేసుకుంటుంది. ఇంకా నటీనటులను ఫైనల్ గా ఎంపిక చెయ్యని క్రిష్ ఈ ఐదు నెలల కాలంలో ఎన్టీఆర్ బయో పిక్ ని పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ గా తీర్చి దిద్దాలి. ఎలాగూ క్రిష్ పూర్తి స్క్రిప్ట్ తో సినిమా సెట్స్ మీద కెళతాడు కాబట్టి.. క్రిష్ నిజాయితీని శంకించలేము. ఇక బాలకృష్ణ కూడా క్రిష్ కి ఎలా కావాలో అలా సహకరించే వ్యక్తి. అందుకే క్రిష్ ధైర్యంగా ఎన్టీఆర్ బయో పిక్ ని మొదలు పెట్టేసాడు.

అయితే అలాంటి డైరెక్టర్ సినిమాలు రెండు ఒకే నెలలో కొద్దీ రోజుల గ్యాప్తో విడుదల కాబోతున్నాయన్నది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. క్రిష్ బాలీవడ్ లో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కించిన మణికర్ణిక తో పాటుగా.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయో పిక్ రెండు సినిమాలు జనవరి నెల 2019 లోనే విడుదల కాబోతున్నాయి. మరి టాప్ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలవడం ఒక రేర్ రికార్డే. ఎన్టీఆర్ బయో పిక్ సంక్రాతి కానుకగా విడుదలవుతుండగా.. కంగనా మణికర్ణిక జనవరి 25 న విడుదలవుతుంది. ఇక ఇక్కడ మరో విషయం గమనించాలి. కంగన మణికర్ణిక తో తన మాజీ బాయ్ ఫ్రెండ్ అయిన హ్రితిక్ రోషన్ తో జనవరి 25 న బాక్సాఫీసు ఫైట్ కి సిద్దమవుతుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*