నిన్న అమరావతి.. నేడు నిమ్మకూరు!!

ramgopal varma ntr

నందమూరి తారక రామారావు బయో పిక్ షూటింగ్ ఒక రేంజ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయో పిక్ షూటింగ్ ని ఆఘమేఘాల మీద కానిచ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా లో విద్యాబాలన్ బసవతారకం పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్ బయో పిక్ తదుపరి షెడ్యూల్ కోసం సమాయత్తం అవుతుంది. అయితే ఈ లోపు దర్శకుడు క్రిష్, బాలకృష్ణ లు ఎన్టీఆర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఒక చిన్న పాటి టూర్ వేశారు. అది కూడా అమరావతి టు నిమ్మకూరు. అమరావతిలో నిన్న శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు.. ని భేటీ అయిన క్రిష్ అండ్ బాలకృష్ణలు.. చంద్రబాబు ఎన్టీఆర్ బయో పిక్ పై ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకుని ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు వెళ్లారు.

నిమ్మకూరులో…..

నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను బాలకృష్ణ, క్రిష్ లు పూలమాలలు వేసి నివాళు అర్పించిన అనంతరం నిమ్మకూరు వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడ మీడియా సమావేశంలో మట్లాడుతూ ఎన్టీఆర్ బయో పిక్ లో తాను భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని… ఎన్టీఆర్ బయో పిక్ మొదటి షెడ్యూల్ కన్నుల పండుగగా.. సాగిందని..బాలీవుడ్ నటి విద్యాబాలన్ బసవతారకం పాత్ర చేస్తున్నారని క్రిష్ చెప్పగా, బాలకృష్ణ తన తండ్రి పాత్రను తాను చెయ్యడం చాలా అదృష్టమని.. ఇక్కడ నిమ్మకూరులో ఎన్టీఆర్ బాలయ్య స్మృతులను, ఆయన చిన్ననాటి విషయాలను గ్రామంలోని పెద్దలను అడిగి తెలుసుకుని వెళ్ళడానికి నిమ్మకూరు వచ్చినట్లుగా ఆయన చెప్పారు.

రెండు రోజుల షూటింగ్….

ఇక నిమ్మకూరు లో ఎన్టీఆర్ కి సంబందించిన రెండు రోజుల షూటింగ్ జరుగుతుందని సమాచారం. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక దృశ్యాలను నిమ్మకూరులో రెండు మూడు రోజుల పాటు చిత్రీకరించేందుకు వచ్చారని తెలుస్తోంది. ఎన్టీఆర్ చిన్నప్పటి ఇల్లు, ఆయన తిరిగిన వీధులు తదితరాలను సినిమాలో కొంత చూపించాలన్న ఉద్దేశంతో చిత్ర యూనిట్ నిమ్మకూరుకు వచ్చిందనే టాక్ వినబడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*