ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వివరాలు..!

ntr audio event details

ఎన్టీఆర్ బయోపిక్ పనులు చకచకా జరుగుతున్నాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ అన్నప్పటి నుండి దర్శకుడు క్రిష్, బాలకృష్ణలు సినిమాని పరిగెత్తిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాలో నటిస్తున్న మెయిన్ కేరెక్టర్స్ లుక్స్ మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఒక పక్క షూటింగ్ తో పాటుగా మరోపక్క పక్క లుక్స్ ని విడుదల చేస్తూ క్రిష్ హడావిడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఆడియో వేడుకని దాని వేదికను దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినట్టుగా సమాచారం. డిసెంబర్ 16వ తేదీన తిరుపతిలో ఆడియో వేడుకను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చేశారట. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టుగా సమాచారం.

ఆడియో ద్వారా పబ్లిసిటీ వేగవంతం

మరి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు ఆడియోలను విడుదల చేస్తారో లేదో తెలియదు గాని… ఈ ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకకి మాత్రం అతిరథమహారథులు హాజరవుతారని తెలుస్తుంది. మరి ఈ ఆడియో వేడుక ద్వారానే ఎన్టీఆర్ బయోపిక్ పబ్లిసిటీని వేగవంతం చేసి సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేందుకు క్రిష్, బాలకృష్ణ ప్రిపేర్ అవుతున్నారట. ఇప్పటికే టాలీవుడ్ టాప్ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. గెస్ట్ లుగా ఉండేది కాసేపే అయినా… వారి వలన సినిమాకి మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమాకి ఆడియో అనేది ప్రధాన బలమని, కీరవాణి స్వరపరిచిన బాణీలు మంచి ఫీల్ కలిగిస్తాయంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*