నాగ్ అశ్విన్ చెప్పింది కరెక్ట్.. ఎన్టీఆర్ రెండు భాగాలుగా?

సావిత్రి బయో పిక్ మహానటి ని తెరకెక్కించిన నాగ అశ్విన్ బయో పిక్స్ ని ఒకే ఒక సినిమాగా అంటే మూడు గంటల్లో చూపించడం కష్టమని చెప్పాడు. అలాగని రెండు పార్టులాగా బయోపిక్స్ తియ్యలేమని కూడా చెప్పాడు. అందుకే మహానటి సినిమాలోని అనేక సీన్స్ ని ఎడిటింగ్ లో తీసెయ్యాల్సి వచ్చిందని నాగ్ అశ్విన్ చెప్పాడు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి బయో పిక్ సూపర్ అయింది. తాజాగా బాలకృష్ణ – క్రిష్ కాంబోలో ఎన్టీఆర్ బయో పిక్ త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ తోపాటుగా నటీనటుల ఎంపికని దర్శకుడు క్రిష్ మొదలు పెట్టాడు. జులై నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోకున్న ఎన్టీఆర్ బయో పిక్ పై ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

ఎన్టీఆర్ జీవితాన్ని తెరమీద పెట్టాలి అంటే… సామాన్యమైన విషయం కాదు. ఆయన నట జీవితం ఎంత ముఖ్యమో… అయన రాజాకీయ జీవితమూ అంతే ముఖ్యం. అలాగే ఆయన పర్సనల్ లైఫ్ కూడా అంతే ముఖ్యం. మరి ఇలా మూడు రకాల వేరియేషన్స్ ఉన్న ఒక జీవితాన్ని తెరమీద చూపించాలంటే నిజంగా మూడు గంటల నిడివి అనేది సరిపోదు. అందుకే దర్శకుడు క్రిష్ కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్రని రెండు భాగాలుగా తియ్యాలని అనుకోవడం… దానికోసం బాలకృష్ణ ని కూడా సంప్రదించడం జరిగాయనే టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తుంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఒక పార్ట్ కింద, ఆయన నట జీవితాన్ని మరో పార్ట్ గా తెరకెక్కిస్తే బావుంటుందని ఆలోచనలో ఉన్నారట.

మరి ఈ విషయంలో బాలకృష్ణ అభిప్రాయం ఎలా ఉంటుందో గాని.. క్రిష్ చేసిన ఆలోచనలు బావుంది అనేవారు ఉన్నారు. నిజంగానే ఎన్టీఆర్ నట జీవితం ఒక ఎత్తయితే .. ఆయన రాజకీయ ప్రయాణం మరో ఎత్తు. మరి మహోన్నత వ్యక్తి జీవితాన్ని కేవలం మూడు గంటలో ప్రేక్షకులకు ఆర్ధమయ్యేట్లుగా చెప్పడం అంత సులువైన పనికాదు. మరి క్రిష్ చెప్పినదానికి బాలయ్య ఎలాంటి డెసిషన్ తీనుకుంటాడో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక బాలయ్య బాబు ఈ సినిమాలో 60 నుండి 70 గెటప్స్ లో కనిపిస్తాడనే ప్రచారం ఉంది. ఇక ఎన్టీఆర్ వైఫ్ కేరెక్టర్ కి బాలీవుడ్ నటి విద్య బాలన్ ని తీసుకున్నట్లుగా సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*