ఆమె పాయింట్ అఫ్ వ్యూలో ఎన్టీఆర్ స్టోరీ..!

sensor problems to ntr biopic

రీసెంట్ గా రిలీజ్ అయిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పోస్టర్ లో బాలయ్య అచ్చం తన తండ్రి లానే ఉన్నారని.. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు బాలకృష్ణనే కరెక్ట్ అని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా మొదటి నుండి ఎక్కడ మొదలు పెడతారు.. ఎక్కడ ఎండ్ చేస్తారు అనే అంశం అభిమానులని తొలుస్తోన్న ప్రశ్న.

చంద్రబాబును విలన్ గా చూపొద్దు…

మొదట ఈ చిత్రానికి ఏదో స్క్రీన్ ప్లే అనుకున్నారు కానీ క్రిష్ రాకతో అదంతా మారిపోయింది. కాకపోతే క్లైమాక్స్ లో చంద్రబాబుని విలన్ గా చూపించ వద్దు అనే కండిషన్ మాత్రం బాలయ్య పెట్టాడంట. ఈ పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని క్రిష్ ఓ నిర్ణయానికి వచ్చాడంట. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మొత్తం ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో జరుగుతుందని ఫిలింనగర్ టాక్.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా…

సినిమాలో ఎన్టీఆర్ స్టోరీ మొత్తం ఆమె భార్య అంటే విద్యాబాలన్‌ చెబుతారట. అందుకే ఆమె ఎంత అడిగినా నో చెప్పకుండా ఈ ప్రాజెక్ట్ లో తీసుకున్నారు. అసలు ఎన్టీఆర్ ఎలా ఉండేవారు..అయన ఎలాంటి వారు.. ఎలా ఎదిగారు.. కుటుంబంతో ఎలా వుండేవాడు వంటి అన్ని చర్చించబోతున్నారని టాక్. బాలకృష్ణకి కూడా ఈ యాంగిల్ నచ్చడంతో ఒకే అనేశారంట. ఇక ఎన్టీఆర్ యంగ్ ఏజ్ పాత్ర కోసం బాలయ్యను గ్రాఫిక్స్‌ సాయంతో కుర్రాడిగా చూపించనున్నారు. ప్రాజెక్ట్ అవుట్ పుట్ విషయంలో క్రిష్ దగ్గర నుండి బాలకృష్ణ వరకు ఎవరూ కంప్రమైజ్ అవ్వట్లేదంట. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*