ఎన్టీఆర్ అడుగుపెడితే మరి…రికార్డులే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెర మీద కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. వెండితెర మీద రికార్డులను వేటాడే ఎన్టీఆర్ బుల్లితెర మీద కూడా అదరగొట్టేస్తున్నాడు. ఎన్టీఆర్ బుల్లితెర మీద అడుగుపెడితే చాలు టీఆర్పీ రేటింగ్ అందనంత ఎత్తుకు ఎగిరిపోతుంది. తెలుగు బిగ్ బాస్ హోస్టింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ మా ఛానల్ కి అద్భుతమైన టీఆర్పీని కట్టబెట్టాడు. బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. ఆ షో అంత పెద్ద హిట్ అవడానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ బిగ్ బాస్ 1 మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. ఇక బిగ్ బాస్ 1 గ్రాండ్ ఫినాలే లోనూ ఎన్టీఆర్ చేసిన యాంకరింగ్ అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఎన్టీఆర్ ఈటివి ఛానల్ లో జరిగిన ఢీ 10 గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి ఢీ 10 ఫైనల్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ చేసిన కామెడీ వలన ఆ షో తో ఈటివి కూడా టాప్ టీఆర్పీని సొంతం చేసుంకుంది. బిగ్ బాస్ 1తో ఎన్టీఆర్ మా టివి ని టాప్ పొజిషన్ లో కూర్చోబెడితే… హీరో నాని బిగ్ బాస్ 2 స్టార్టింగ్ ఎపిసోడ్ తో మరోసారి మా ఛానల్ కి మంచి టీఆర్పీ రేటింగ్ అందించాడు. ఇక ఎన్టీఆర్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేతో మళ్లీ మా ఛానల్ ని టాప్ లో కూర్చోబెడితే.. తాజాగా ఈ టివి ఛానల్ ని ఢీ 10 తో టాప్ పొజిషన్లో కూర్చోబెట్టేసాడు ఎన్టీఆర్. ప్రస్తుతం అధిక టీఆర్పీ రేటింగ్స్ తో టాప్ లో ఉన్న ఛానల్స్ వివరాలు మీకోసం.

1. బిగ్ బాస్ తెలుగు 1st ఎపిసోడ్ – 16.18
2. బిగ్ బాస్ తెలుగు 2 ఫస్ట్ ఎపిసోడ్ – 15.05
3. బిగ్ బాస్ తెలుగు ఫినాలే ఎపిసోడ్ – 14.13
4. ఢీ 10 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ – 13.9

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*