అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేస్తున్న ఇద్దరు హీరోలు..!

బాహుబలి’ సిరీస్ తో వరల్డ్ వైడ్ పాపులర్ అయిన రాజమౌళి.. తన నెక్స్ట్ మూవీ అంటే ‘బాహుబలి’కి మించి ఉంటుందనే అందరూ అనుకుంటారు. అందుకే రాజమౌళి టాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్‌ కు శ్రీకారం చుట్టాడు. ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో ఈ సినిమాను తీయబోతున్నాడు జక్కన్న. దీనిపై ముందు నుండే అంచనాలు ఉండటంతో రాజమౌళి అది గ్రహించి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇంకా హీరోలకు కథ చెప్పకుండా…

డిసెంబర్ లో స్టార్ట్ అవుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి మూడు నెలలు మాత్రమే టైం ఉంది. ఇక బాహుబాలి టైంలో రాజమౌళితో పనిచేసే అవకాశం చేజార్చుకున్న రచయిత బుర్ర సాయి మాధవ్ ఇప్పుడు చరణ్ – ఎన్టీఆర్ మల్టీస్టారర్ కోసం పనిచెయ్యబోతున్నాడు. మరోపక్క ఇంతవరకు రాజమౌళి హీరోలిద్దరికీ కథ కూడా చెప్పలేదట. ఇది బ్రిటిష్‌ కాలానికి చెందిన కథ అని తెలుస్తుంది. ఇందులో గ్రాఫిక్స్ కి పెద్దగా చోటుండదని మొదటి నుండి ప్రచారం జరుగుతున్నప్పటికీ… ఇందులో గ్రాఫిక్స్‌ చాలా కీలకం కానుందని తెలుస్తుంది. అందుకు గాను కొన్ని గ్రాఫిక్స్ కంపెనీస్ తో రాజమౌళి మాట్లాడుతున్నారు.

మరే సినిమాలు చేయకుండా….

రాజమౌళి సినిమాలంటే కనీసం రెండు ఏళ్లు పడుతుంది. మరోపక్క చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ 2020 సమ్మర్‌ వరకు మరే చిత్రాలకి డేట్స్‌ ఇవ్వడం లేదు. ముందు కమిట్ అయిన చిత్రాలకి వీరిద్దరూ అడ్వాన్సులు తిరిగి ఇచ్చేసినట్టు సమాచారం. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి. ఇందులో చరణ్, ఎన్టీఆర్ పాత్ర గురించి తెలియాల్సిఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1