తారక్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్!

జూనియర్ ఎన్టీఆర్ నిన్న ఓ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు స్వీకరించారు. సెలెక్ట్ మొబైల్స్ కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించనున్నారు. నిన్ననే దానికి సంబందించి ఓ కార్యక్రమం నిర్వహించి ఆఫిషల్ అనౌన్స్ చేశారు ఆ సంస్థ. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో..మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకి తారక్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

చమత్కారంగా….

మీరు ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నారా అన్న ప్రశ్నకు.. ” నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను..ఇప్పటికి నేను ఆ మాటకే కట్టుబడి ఉంటాను.. మీకు తెలియకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి” అని చమత్కారంగా సమాధానం ఇచ్చారు.

ఇంటర్ లోనే….

మీరు ఫోన్ ఎప్పుడు నుండి వాడటం స్టార్ట్ చేశారు? అన్న ప్రశ్నకు… ” నేను ఇంటర్ చదువుకుంటున్న టైములో.. జగదీష్ మార్కెట్ కి వెళ్లి అక్కడ సెకండ్ హ్యాండ్ లో ఆల్కాటెల్ అనే మొబైల్ కొన్నాను అప్పుటి నుంచి” అని చెప్పాడు.

పోజులివ్వడం రాదు….

మీరు ఫోన్ ఎక్కువగా వాడతారా? సెల్ఫీలు బాగా దిగుతారా? అన్న ప్రశ్నకు… ” ప్రపంచం చాలా మారిపోయింది.. మనకి సెల్ తో అంతగా పని లేకపోయినా సరదాగా ఫోన్ తీసి చూస్తున్నాం..నేను కూడా అంతే. నేను అసలు ఫొటోస్ దిగను. నాకు ఫోటోస్ అంటే ఇష్టం ఉండదు. సెల్ఫీస్ కూడా అసలు దిగను.. నా భార్య నన్ను ఫొటోలు తీస్తానని అంటుంది. కానీ, నాకేమో పోజులివ్వడం రాదు..’’ అని చెప్పుకొచ్చాడు.

మూడు నెలలైనా మొబైల్ లేకుండా….

మొబైల్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు అన్న ప్రశ్నకు… ” ఈ కాలంలో మొబైల్ లేకుండా ఉండటం చాలా కష్టం. నేను చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా ఆలా లేను. ఆలా ఒక మూడు నెలలు అయినా ఉండాలని నా కోరిక. అందులో ఉన్న ఫీచర్స్ వాడకపోయినా కనీసం ఎవరితోనైనా మాట్లాడటానికైనా ఫోన్ కావాల్సిందేనని” అని సమాధానం ఇచ్చాడు తారక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*