తాతగారి మీద ప్రేమ ఆ లేఖలో…?

ఈ రోజు, సరిగ్గా ఇదే రోజు 95 ఏళ్ళ క్రితం ఒక మహానుభావుడు జన్మించిన రోజు. తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆ మహానుభావుడు ఎవరో కాదు.. నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందే.. నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించుకున్న మహా నటుడు. నట జీవితం నుండి రాజకీయాల్లోకి టర్న్ తీసుకున్నప్పటికీ..ఎన్టీఆర్ నట జీవితాన్ని వదలలేదు. అలాగే రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి సీఎం గా చక్రం తిప్పిన ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించాడు. అయితే ఈ రోజు ఆయన జయంతి కావడంతో.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన హరికృష్ణ, ఎన్టీఆర్, రామకృష్ణ, కళ్యాణ్ రామ్, పురందరేశ్వరి, నారా బ్రాహ్మణి లు ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చి ఆయనకు నివాళులర్పించారు. ఇక చంద్రబాబు, బాలకృష్ణ మిగతా వారు విజయవాడలో టిడిపి మహానాడులో ఎన్టీఆర్ కి ఘన నివాళులు అర్పించారు.

పద్యంతో ప్రేమ తెలిపిన మనవడు…

అయితే తండ్రి హరికృష్ణ, అన్న కళ్యాణ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారు నందమూరి తారక రామారావు గారిని తలుచుకుని…

మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది…
మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది…
పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..

– సదా మీ ప్రేమకు బానిసను

అంటూ తన తాతయ్యను తలచుకుంటూ భావోద్వేగంతో కూడిన ఓ పోస్టర్ ను విడుదల చేసాడు. ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ ఎంత దూరం పెట్టినా.. తన తాత గారంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఎనలేని గౌరవం, ప్రేమ ఎంతుందో ఈ లేఖలోనే తెలుస్తుంది. అలాగే ఎన్టీఆర్ రూపు రేఖలతో పుట్టడమే కాదు… ఎన్టీఆర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నటుడిగా అందరి మనసుల్లో నిలిచిపోయాడు. ఇక రాజకీయాల్లోనూ గతంలో ఎన్టీఆర్ స్పీచులు చూస్తే… సీనియర్ ఎన్టీఆర్ కి తగిన వారసుడు అనిపిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*