అతని కోసం ఏమైనా చేస్తాడు

NTR #RRR look

కళ్యాణ్ రామ్ ఒక పక్క నిర్మాత, మరో పక్క హీరో. గత ఏడాది వరకు అటు హీరోగానూ, ఇటు నిర్మాతగానూ కళ్యాణ్ రామ్ వరుస వైఫల్యాలతో సతమతమయ్యాడు. అయితే తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా గత ఏడాది కళ్యాణ్ రామ్ జై లవ కుశ సినిమా చేసి హిట్ కొట్టాడు. అప్పట్లో తన అన్న కళ్యాణ్ రామ్ ని ఒడ్డున పడెయ్యడానికే.. ఎన్టీఆర్ జై లవ కుశ ని బాబీ దర్శకత్వంలో చేసాడనే టాక్ నడిచింది. ఇక ఆ సినిమాతో కళ్యాణ్ రామ్ భారీగా లాభాలు తన అకౌంట్ లో వేసుకున్నాడు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా మరోమారు తారక్ తో ఒక సినిమా చేయబోతున్నాడట.

ఈ విషయాన్నీ కళ్యాణ్ రామ్ నా నువ్వే ప్రమోషన్స్ లో చెప్పాడు. మరి కళ్యాణ్ రామ్ తారక్ తో సినిమా ఉంటుంది అంటే అది పక్కా అని తెలుస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద సమేత ని చేస్తున్నాడు. ఇక ఈ సినిమా దసరా బరిలో ఉంది. మరోపక్క ఎన్టీఆర్, రాజమౌళి డైరెక్టర్ గా చరణ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చెయ్యబోతున్నాడు. మరి సోషల్ మీడియా కథనాల బట్టి ఎన్టీఆర్ – చరణ్ ల మల్టీస్టారర్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో రెండేళ్లు టైం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో సినిమా చెయ్యాలంటే ఎలా లేదన్న రెండేళ్లు ఆగాల్సిందే.

మరి కళ్యాణ్ రామ్ మాత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నేను హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాం. ఆ తరువాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది అని అంటున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేని విషయం. కానీ అన్న తో తారక్ మాత్రం సినిమా ఖచ్చితంగా చేసి తీరుతాడు అనేది మాత్రం పక్కా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*