ఎన్టీఆర్ #RRR లుక్ అది కాదంట..!

rrr movie latest update

ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళి #RRR మూవీ మొదటి షెడ్యూల్ కంప్లీట్ కావొస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ తనకి సంబందించిన షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ పై రాజమౌళి కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అది కూడా ఈ రోజో రేపో పూర్తవుతుంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా.. అంటే 100 కేజీల బరువుతో కనిపిస్తాడని… అలాగే ఎన్టీఆర్ ఎమోషనల్ గా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే పాత్రలో కనబడుతుంటే… రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ తో సిక్స్ ప్యాక్ తో #RRR లో చెలరేగిపోతాడన్నారు. ఇక గత రెండు రోజులుగా ఎన్టీఆర్ బరువు పెరిగిన లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి..

సంవత్సరం కింది ఫోటోలు…

ఆ ఫొటోస్ లో ఉన్న ఎన్టీఆర్ లుక్కే #RRR ఫైనల్ లుక్ అంటూ వార్తలొస్తున్నాయి. అరవింద సమేత కోసం బాగా బరువు తగ్గిన ఎన్టీఆర్.. మళ్ళీ రాజమౌళి #RRR కోసం ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో బరువు పెరుగుతున్నాడని.. ఇక లీకైన ఆ పిక్ #RRRకి సంబందించిన లుక్కే అంటూ ప్రచారం జరుగుతుండగా.. ఆ ఎన్టీఆర్ లుక్ #RRR లోనిది కాదని ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ క్లారిటీ ఇచ్చాడు. అసలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆ లుక్ గత ఏడాది ఎన్టీఆర్ లుక్ అని… ఆ ఫొటోలు సంవత్సరం క్రిందివని చెబుతున్నాడు.

కొత్త లుక్ ఎలా ఉంటుందో…

RRR లుక్ కొత్తగా ఉంటుందని… ఎన్టీఆర్ లుక్ గురించి ప్రస్తుతం వస్తున్న వార్తలను నమ్మకండి అంటూ ట్వీట్ చేసాడు. ఇక ఎన్టీఆర్ RRR లుక్ ప్రస్తుతం ఫెక్ అని తేలిపోయింది. మారి ఆ కొత్త లుక్ ఎలా ఉండబోతుందో కానీ.. ప్రస్తుతం ఎన్టీఆర్ న్యూ లుక్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*