సిద్దార్థనా..? రాఘవనా…?

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎన్టీఆర్ ఫాన్స్ కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఈ రోజు సాయంత్రం 4.30 కి ఎన్టీఆర్ న్యూ లుక్ బయటికొస్తుంది. అయితే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాపై ట్రేడ్ లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి, కాదు భారీ అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ గత సినిమా పెద్ద డిజాస్టర్ అయినా అయన దర్శకత్వానికి భారీ క్రేజ్ ఉంది. అయితే ఎన్టీఆర్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ని కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేసే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది.

టైటిల్ అదేనా…?

ఇప్పటికే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ గా ‘అసామాన్యుడు’ వాడుకలో ఉండగా నిన్నటికి నిన్న ‘రా రా కుమారా’ అనే టైటిల్ వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ టైటిల్ ని, ఈ సినిమా లో ఎన్టీఆర్ పేరు కు లింక్ చేస్తూ ‘అరవింద సమేత సిద్దార్ద్’ అయినా, లేదంటే ‘అరవింద సమేత రాఘవ’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ని చిత్ర బృందం ఫైనల్ చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫ్యామిలీ బాయ్ అండ్ లవర్ బాయ్ లా కనబడతాడని అలాగే ఎన్టీఆర్ పాత్ర పేరుతోనే ఈ సినిమా టైటిల్ ఉంటుందంటూ వార్తలొస్తున్నాయి.

సీనియర్ హీరోయిన్ కోసం పోటాపోటీ…

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో సీనియర్ హీరోయిన్ రంభ నటిస్తుందనే టాక్ కూడా ఉంది. మరి ఫైనల్ గా సీనియర్ హీరోయిన్ గా త్రివిక్రమ్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడేమో గాని ఆ పాత్రకి మీనా, లయ, రంభ పేర్లు వినబడుతున్నాయి. ఇకపోతే హారిక అండ్ హాసిని బ్యానర్ మీద రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తుండగా ఈ సినిమా ని దసరాకి విడుదల చెయ్యాలనే టార్గెట్ గా పెట్టుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1