నిన్న మాస్ లుక్ తో…. ఈ రోజు క్లాస్ లుక్ తో చంపేస్తున్నాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫాన్స్ కి ఎన్టీఆర్ ట్రీట్ ల మీద ట్రీట్ లు ఇచ్చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఎన్టీఆర్ 28 వ మూవీ కి త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ అంటూ క్లాస్ టైటిల్ పెట్టి… క్యాప్షన్ గా ‘వీర రాఘవ’ అంటూ మాస్ టైటిల్ పెట్టాడు. ఈ టైటిల్ తో పాటు ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఒక రోజు ముందే అంటే నిన్న శనివారం సాయంత్రమే ఎన్టీఆర్ మాస్ లుక్ ని ఫాన్స్ కి అందించింది. టైటిల్ తో పాటుగా ఎన్టీఆర్ మాస్ అండ్ సిక్స్ ప్యాక్ లుక్ ని చూసి పండగ చేసుకున్న ఎన్టీఆర్ ఫాన్స్ కి ఈ రోజు ఆదివారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బగంగా మరో ట్రీట్ ఇచ్చాడు.

ఈసారి ‘అరవింద సమేత’ మోషన్ పోస్టర్ ని రివీల్ చేశారు. మరి ఆ మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను చూపిస్తూ, హీరోయిన్ పూజా హెగ్డేతో ఉన్న మోషన్ పోస్టర్ ను ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నిన్న సిక్స్ ప్యాక్ అండ్ మాస్ లుక్ తో పిచ్చెక్కించిన ఎన్టీఆర్.. ఈ రోజు క్లాస్ లుక్ తో లవర్ బాయ్ మాదిరి ఇరగ దీస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ క్లాస్ లుక్ తో పాటుగా హీరోయిన్ పూజ హెగ్డే లుక్ ని కూడా దర్శకుడు త్రివిక్రమ్ రివీల్ చేసాడు. పూజ హెగ్డే కూడా క్యూట్ గా ఉంది ఈ పోస్టర్ లో. ఇక మోషన్ పోస్టర్ చివరిలో నందమూరి తారకరామారావుకు జన్మదిన శుభాకాంక్షలు.. అంటూ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు చూడండి అది అందరిని తెగ ఇంప్రెస్స్ చేసేస్తుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ లుక్ తోనే అందరిని మైమరపించిన ఎన్టీఆర్ అతి తొందరొలెనే.. ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రేడి అవుతున్నాడు. ఇక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ – థమన్ ల ఈ ‘అరవింద సమేత’ దసరా బరిలో నిలవడానికి చక చకా రెడీ అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*