ఎన్టీఆర్ తో పాటు సునీల్ కూడా ఉన్నాడు..!

నిన్న విడుదలైన ‘అరవింద సమేత వీరరాఘవ’ టీజర్ రికార్డు లైక్స్, వ్యూస్ తో దూసుకుపోతుంది. త్రివిక్రమ్ నుండి ఇటువంటి టీజర్ ఎక్స్ పెక్ట్ చేయలేదు తన ఫ్యాన్స్. త్రివిక్రమ్ టేకింగ్ కానీ..ఎన్టీఆర్ చెప్పే స్టైలిష్ డైలాగ్స్ కానీ టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఎన్టీఆర్ ఒక్కడినే చూపించి తనపైనే జనాల దృష్టి పడేలా చేశాడు త్రివిక్రమ్. కానీ మీరు టీజర్ మొత్తం ఫ్రేమ్ టూ ఫ్రేమ్ చూస్తే నటుడు సునీల్ కనిపిస్తాడు. ఏంటీ నమ్మట్లేదా? ఒకసారి టీజర్ చూడండి.

మళ్లీ రీఎంట్రీ…!

టీజర్ లో ఎన్టీఆర్ ‘కంటబడ్డావా… కనికరిస్తానేమో! యెంటబడ్డానా… నరికేస్తా’ అని ఎన్టీఆర్‌ డైలాగ్‌ చెప్పడానికి ముందు కుర్చీ గాల్లోకి లేచిన సమయంలో జాగ్రత్తగా గమనిస్తే సునీల్‌ కనిపిస్తాడు. కావాలంటే పై ఫోటో ను సరిగా చూడండి. ఇంతకాలం దాకా సునీల్ హీరోగా నటించాడు. స్టార్టింగ్ లో పర్లేదు అనిపించుకున్నా ఆ తర్వాత అన్ని సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో మళ్లీ తిరిగి కమెడియన్ వేషం వేసుకోవటానికి రెడీ అయ్యాడు.

హీరో స్నేహితుడిగా..?

ఆలా అనుకున్నాడో లేడో..తన స్నేహితుడైన త్రివిక్రమ్ తొలి అవకాశం ‘అరవింద సమేత వీరరాఘవ’లో ఇచ్చాడు. టీజర్ బట్టి చూస్తుంటే సునీల్ ఇందులో ఎన్టీఆర్ కి స్నేహితుడిగా నటించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎంత మంది ఆర్టిస్ట్స్ ఉన్న టీజర్ లో వాళ్లెవరినీ చూపించకుండా ఎన్టీఆర్ ఒక్కడినే చూపించి తనతో పాటు సునీల్ కూడా కనపడలేలా చేశాడు త్రివిక్రమ్. దీంతో ఈ సినిమాతో సునీల్ హాస్య నటుడిగా ఈ సినిమా గ్రాండ్‌ రీఎంట్రీ ఇచ్చినట్టే. గతంలో వీరి కాంబినేషన్ ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*