టైటిల్ వెనుక లాజిక్

ఎన్టీఆర్ Junior NTR రామాయణ

ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘అరవింద సమేత’ చిత్రం. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ టైటిల్ వెనుక బోలెడంత క్యూరియాసిటీ నడుస్తుంది. ఈ సినిమా టైటిల్ ను బట్టి ఈ సినిమా స్టోరీ ఏంటో అని ఆ లాజిక్ ను ఛేదించే పనిలో పడ్డారు ఫ్యాన్స్.

అరవింద అనేది సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే పాత్ర పేరని, వీర రాఘవ అనేది ఎన్టీఆర్ పాత్ర పేరని అన్నారు. మరి కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి అరవింద అనేది ఎన్టీఆర్ సాఫ్ట్ క్యారెక్టర్ పేరని.. వీరరాఘవ అనేది రాయలసీమ ఉండే ఎన్టీఆర్ యొక్క మాస్ షేడ్ అని విశ్లేషణ ఇచ్చారు. అయితే టైటిల్ రహస్యం అది కూడ కాదని చిత్రం యూనిట్ క్లారిటీ ఇచ్చారు.

దాంతో ఫ్యాన్స్ మరోసారి స్టోరీ ఏంటోనని ఆ లాజిక్ ను ఛేదించే పని మొదలుపెట్టారు. అయితే ఆ లాజిక్ ఏంటో తెలియాలంటే త్రివిక్రమ్ ఐన.. ఎన్టీఆర్ ఐన నోరు విప్పాలి. అయితే వాళ్లు ఇప్పట్లో నోరు విప్పరు ఎందుకంటే ఆలా చేస్తే సినిమాను స్పోయిల్ చేసినట్టు అవుతుంది. సో సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయక తప్పదు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*