చైతు- అఖిల్ బాగా హర్ట్ అయ్యారు!

Akkineni Nagarjuna telugu post telugu news

నాగార్జున ముందు నుండే వర్మపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వర్మ చెప్పిన స్టోరీ తనకు బాగా నచ్చడంతో ముందుకు వెళ్ళాడు. వర్మను ఏ మ్యాటర్స్ లో ఇంవోల్వ్ కావొద్దని.. కేవలం కథ మీదే పని చేయమని చెప్పానని.. మళ్లీ మళ్లీ తిప్పుకున్నానని బాగానే కబుర్లు చెప్పారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే రెజెల్ట్ తారుమారైంది.నాగ్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. దాంతో నాగ్ ఏం చేసేది లేక.. ట్విట్టర్ లో పాజిటివ్ గా పోస్ట్ పెట్టాడు. కొత్త సోమవారం రాగానే మళ్లీ తన పని తాను చేసుకుంటున్నట్లు స్వయంగా చెప్పుకొచ్చారు. అంటే ‘ఆఫీసర్’ సినిమా పోయినందుకు నేను ఏమి ఫీల్ అవ్వట్లేదని ఇండైరెక్ట్ గా చెప్పాడు.

బాధపడుతున్న కుమారులు…

అయితే నాగ్ పిల్లలు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. రీసెంట్ గా వీరు ముగ్గురు ఓ స్పోర్ట్స్ లీగ్ ఈవెంట్ కి వెళ్లి కలవగా.. అక్కడ చైతు- అఖిల్ చాలా ఎమోషనల్ అయిపోయారట. తమ సినిమాలు ఆడకపోయినా ఆ సంగతి వేరు.. కానీ నాన్నగారి నుండి మరీ ఇంత దారుణమైన ఫలితం ఇచ్చే చిత్రం అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదని అన్నారట చైతు- అఖిల్. నాగ్ ఆఫీసర్ పోయినందుకు అంతగా ఫీల్ అవ్వలేదు కానీ.. చెయ్-అఖిల్ ఇంతగా బాధపడిపోవడం చూసి చాలా హర్ట్ అయ్యారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*