ఆఫీసర్ రెజుల్ట్ పై ఇండైరెక్ట్ గా స్పందించిన నాగ్!

శివ తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ లో ‘ఆఫీసర్’ అనే సినిమా వచ్చింది. గత దశాబ్దం నుండి రామ్ గోపాల్‌ వర్మ తీసే డిజాస్టర్ సినిమాలు చూసి రాముతో సినిమా చేయడానికి ఏ చిన్న హీరో కూడా ముందుకు రాలేదు. కానీ నాగార్జున రాముని నమ్మి ఆయనతో సినిమా చేశాడు. అంతే.. సినిమా ఏమైందో మీకే తెలుసు.

దారుణంగా ఉన్న క‌లెక్ష‌న్లు..

నాగ్ తన సినీ కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని పరాభవంగా నిలిచిపోయేలా ఉందీ చిత్రం. దీనికి వచ్చే కలెక్షన్స్ చూస్తే సాధారణ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మొదటి రోజు షేర్ ఏపీ అండ్ తెలంగాణ తీసుకుంటే 50 లక్షలు కూడా దాటలేదు. దాన్నిబట్టి అర్ధం చేసుకోవొచ్చు ఈ సినిమా ఎలా ఆడుతుందో. నాగ్ ఈ సినిమా స్టోరీ విన్నపుడు థ్రిల్ ఫీల్ అయినా.. సినిమా జరుగుతున్నప్పుడే అర్ధం అయ్యిపోయిందంట ఈ సినిమా ఫ్లాప్‌ అవుతుందని. కానీ మరీ ఇంత దారుణమైన ఫలితం ఉంటుందని నాగ్ ఊహించి ఉండడు.

అన్‌డైరెక్ట్ గా సినిమాపై ట్విట్‌..

ఇంత దారుణమైన ఫలితం చూశాక నాగ్ సైలెంట్ అయ్యిపోయాడు. అందుకే పోస్ట్ రిలీజ్ ప్రెస్ మీట్స్ కానీ ఫంక్షన్ కానీ ఏమి చేయలేదు. కానీ ఈరోజు ఉదయం తన ట్విట్టర్ లో సినిమా ఫలితం గురించి పరోక్షంగా ఒక ట్వీట్ పెట్టాడు నాగ్. వారం గడిచిపోయి సోమవారం వచ్చిందని.. ‘విజయం అంతిమం కాదు.. పరాజయం భయానకం కాదని.. ఏం జరిగిన ముందుకు సాగిపోవడమే మనిషి బలాన్ని చాటుతుందని విన్ స్టన్ చర్చిల్ అన్నాడని.. సో నేను చిరునవ్వుతో నా ప్రయాణం ముందుకు సాగిద్దాం అనుకుంటున్నానని నాగ్ తనదైన శైలిలో ట్వీట్ పెట్టాడు. నాగ్ పోస్ట్ చేసిన ట్వీట్ ప్రకారం చూస్తే ‘ఆఫీసర్’ సినిమా రెజుల్ట్ వల్ల తానేమీ కుంగిపోలేదని అర్ధం అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*