2018 ఓవర్సీస్ టాప్ 5 మూవీస్ ఇవే!!

tamil films promotions in telugu

ఈ ఏడాది చాలా సినిమాలే విడుదలయ్యాయి. కానీ చాలా తక్కువ సినిమాలే కోట్లు కొల్లకొట్టాయి కానీ…. హిట్ అయిన సినిమాల కన్నా.. ప్లాప్ అయిన సినిమా లిస్ట్ చాంతాడంత ఉంది. అయితే ఈ ఏడాది భారీ అంచనాలతో బరిలోకి దిగిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. కొన్ని సినిమాలు అస్సలు అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసుని దడ దడ లాడించాయి. అజ్ఞాతవాసి లాటి సినిమాలు భారీ అంచనాలతో బరిలోకి దిగితే భారీగా డిజాస్టర్ అయ్యాయి. ఇక మహానటి, గీత గోవిందం లాంటి సినిమాలైతే ఎటువంటి అంచనాలు లేకుండా ఇండియా తో పాటుగా ఓవర్సీస్ బాక్సాఫీసుకి వణుకు పుట్టించాయి.

కోట్లు కొల్లగొట్టి….

ఇక మార్చి 30 న విడుదలైన రామ్ చరణ్ – సుకుమార్ ల రంగస్థలం కోట్లు కొల్లగొట్టింది. ఓవర్సీస్ లోను రంగస్థలం అలాంటి ఇలాంటి హిట్ కాదు. ఓవర్సీస్ బాక్సాఫీసుని రంగస్థలం గడగడలాడించింది. ఇక మహానటి మూవీ కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… ఓవర్సీస్ లోను ప్రతాపం చూపించింది. ఇక మహేష్ భరత్ అనే నేను కలెక్షన్స్ వైజ్ గా ఇండియాలో పర్వాలేదనిపించింది… ఓవర్సీస్ లో మాత్రం కొరటాల , మహేష్ క్రేజ్ తో దున్నేసింది. ఇక విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా ఇక్కడ , అటు ఓవర్సీస్ లోను స్టార్ హీరోల రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. దసరాకి భారీ అంచనాలతో బరిలోకి దిగిన అరవింద సమేత కూడా ఈ ఏడాది ఓవర్సీస్ లో త్రివిక్రమ్ క్రేజ్ తో కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది.

2018 ఓవర్సీస్ బాక్సాఫీసు టాప్ మూవీస్ లిస్ట్

రంగస్థలం          3,513,450
భరత్ అనే నేను  3,416,451
మహానటి          2,543,515
గీత గోవిందం      2,465,367
అరవింద సమేత 2,181,943 మిలియన్స్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*