పంతం మొదటి రోజు కలెక్షన్స్!

గోపీచంద్ – మెహ్రీన్ కౌర్ జంటగా కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన పంతం సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే గత వారం సరైన సినిమాలేవీ థియేటర్స్ లో లేకపోవడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ తో సంబంధం లేకుండా గోపీచంద్ పంతం సినిమా కలెక్షన్స్ రాబట్టింది. యావరేజ్ టాక్ అంటే.. కలెక్షన్స్ కూడా యావరేజ్ గానే ఉంటాయనుకున్నాను. కానీ పంతం కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3.22 కోట్లు షేర్ తో 5.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే గోపీచంద్ సినిమాకి ఇలా మంచి ఓపెనింగ్స్ రావ‌డానికి ప్ర‌ధాన‌ కారణం ఆ సినిమాకి చేసిన ప్రమోషన్స్ అనే మాట గట్టిగా వినబడుతుంది.

ఏరియా: ఫస్ట్ డే షేర్

నైజాం          –            1,12,00,000
సీడెడ్          –              47,00,000
నెల్లూరు       –              12,00,000
గుంటూరు    –              33,00,000
కృష్ణ             –               15,77,125
వెస్ట్ గోదావరి –               16,35,976
ఈస్ట్ గోదావరి –             20,92,000
ఉత్తరాంధ్ర      –              34,79,085

ఏపీ, టీస్ షేర్ –             2.92 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా –    20,00,000
ఓవర్సీస్       –              10,00,000

వరల్డ్ వైడ్ షేర్            3.22 కోట్లు,

గ్రాస్                           5.2 కోట్లు

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*