‘పంతం’ టీజర్ రివ్యూ!

ప్రస్తుతం హీరో గోపీచంద్ కొత్త దర్శకుడు చక్రి డైరెక్షన్ లో ‘పంతం’ అనే సినిమా చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. గోపీచంద్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తుంది. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా టీజర్ ఈరోజు ఉదయం విడుదల చేసింది టీం.

పవర్ ఫుల్ డైలాగ్ లతో…

గోపీచంద్ సరికొత్త లుక్ తో కనిపించిన ఈ టీజర్ లో యాక్షన్ తో పాటు ఎమోషన్ కి కూడా ప్రాధ్యానత ఇచ్చారని అర్ధం అవుతుంది. టీజర్ లో గోపీచంద్ కోర్ట్ లో చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్ అయ్యే అవకాశం ఉంది. “ఫ్రీగా ఇళ్లిస్తాం .. కరెంట్ ఇస్తాం .. రుణాలు మాఫీ చేస్తాం .. ఓటుకు ఐదువేలు ఇస్తాం అనగానే ముందు వెనుక .. మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి .. అవినీతిలేని సమాజం కావాలి .. కరెప్షన్ లేని కంట్రీ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయ్” అంటూ పవర్ ఫుల్ గా చెప్పాడు హీరో గోపీచంద్. టీజర్ మొత్తానికి ఆ సీన్ హైలైట్ గా నిలిచింది. టీజర్ చూస్తుంటే ఈసారి గోపి కచ్చితంగా హిట్ కొడతాడేమో అనిపిస్తుంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ ఈ సినిమాకు ప్లస్ అవ్వనుంది. ఇక హీరోయిన్ మెహ్రీన్ ఎప్పటిలానే చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు.