పేపర్ బాయ్ సినిమా చిత్రీకరణ పూర్తి!

tamil films promotions in telugu

సంపత్ నంది టీమ్‌ వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందించబడుతోంది. హైదరాబాద్, ముంబాయి, లోనవాల, పూణే, కేరళ, గోవా వంటి నగరాల్లో ఈ సినిమా తెరకెక్కింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని జులై లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా జూన్ 20న ‘పేపర్ బాయ్’ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

నటీనటులు:

సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా.
సాంకేతిక నిపుణులు:
కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ : సంపత్ నంది.
డైరెక్షన్: వి. జయశంకర్
నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ.
సంగీతం: భీమ్స్
ఎడిటర్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫి: సుందర్ రాజన్.
ఆర్ట్: రాజీవ్
స్క్రిప్ట్ కో ఆడినేటర్: సుధాకర్ పావులూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*