ఎందుకిలా చేస్తున్నాడో…?

ఎప్పుడూ మెగా ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయంటూ మీడియా హడావిడి చెయ్యడం కాదు.. మీడియా మెగా ఫ్యామిలీ మేటర్ తీసిన ప్రతిసారీ మాలో గొడవలేం లేదంటూ రామ్ చరణ్ వంటివారు క్లారిటీ ఇస్తుంటారు. కానీ నాగబాబు అయితే కాస్త గట్టిగానే స్పందిస్తుంటాడు… వాళ్ళ రిలేషన్ విషయంలో. మరి ఎప్పుడూ అంటీముట్టనుండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హఠాత్తుగా మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్ మెయింటెయిన్ చేస్తున్నాడు. అన్న చిరుతో రాజకీయాలతో విభేదాల దగ్గరనుండి, చిరు చిన్న కూతురు శ్రీజ మొదటి పెళ్లి వ్యవహారంలోనూ పవన్ కళ్యాణ్ ఎంతగా ఇన్వాల్వ్ అయ్యాడో… తర్వాత అంటే పవన్ కి కొడుకు పుట్టిన దగ్గరనుండి మళ్ళీ మెగా ఫ్యామిలీతో తసంబంధాలు కొనసాగిస్తున్నాడు.

చిరు ఇంటికెళ్లి……

కొడుకుని తీసుకుని అన్న ఇంటికెళ్ళడం, కొడుక్కి అన్న పేరు కలిసొచ్చేలా పెట్టడం, రామ్ చరణ్ పుట్టిన రోజునాడు పెద్ద కొడుకు అకీరా తో కలిసి చిరు ఇంటికెళ్ళడం… అంతేనా రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలాన్ని చెర్రీ భార్య భర్తలతో కలిసి తన భార్య అన్నాతో కూడా సినిమాని చూడడం చేసిన పవన్ కళ్యాణ్ ఎందుకిలా చేస్తున్నాడో.. రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ సపోర్ట్ కావాలనా? …లేదంటే మెగా హీరోగా తన తర్వాత తన అన్న కొడుకు చరణ్ ఫాలోయింగ్ పెంచడానికా.. అని అనుకునేలోపు రంగస్థలం విజయోత్సవం వేడుకల్లోఅదిరిపోయే స్పీచ్ ఇవ్వడంతో.. ఇప్పుడు మెగా ఫాన్స్ లో ఏర్పడిన చీలిక కూడా పోయేట్లుగానే కనబడుతుంది.

రంగస్థలం విజయోత్సవ సభలో…..

రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ లు రంగస్థలం స్టేజ్ మీద చూడగానే మెగా ఫాన్స్ కి పిచ్చెక్కేసింది. అలాగే పవన్ ఫాన్స్ ఇప్పుడు మెగా ఫాన్స్ లో కలిసిపోయారు కూడా. అలాగే రామ్ చరణ్ కి పవన్ తో పాటు పవన్ ఫాన్స్ సపోర్ట్ కూడా దొరికేసింది. కాకపోతే పవన్ ఇలా ఉన్నట్టుండి మెగా ఫ్యామిలీ కి ఎందుకు దగ్గరవుతున్నాడో అనేది చాలామందికి అంతుబట్టడం లేదు. అందులోను చరణ్ రంగస్థలానికి ఆస్కార్ కోసం పోరాడదామని నినాదం కూడా కొత్తగానే ఉంది. మరి రంగస్థలం స్టేజ్ మీద చరణ్ కి హాగ్ ఇవ్వడం దగ్గరనుండి… ముద్దు పెట్టడం వరకు కేవలం ప్రేమే అనుకోవాలా.. లేదంటే మారేదన్నానా అనేది మాత్రం బాగా థింక్ చెయ్యాల్సిన విషయమే.

Ravi Batchali
About Ravi Batchali 17060 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*