మెగా మూమెంట్ అదిరింది..!

మెగా ఫ్యామిలీతో ఎపుడు పవన్ కళ్యాణ్ కలిసినా అది మెగా ఫాన్స్ కి మాత్రమే కాదు మిగతా వారికీ పండుగగా ఉంటుంది. మెగా ఫ్యామిలీ తో పవన్ కళ్యాణ్ కాస్త ఎడంగా ఉంటాడు. గత ఏడాది వరకు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి దూరంగానే గడిపాడు. కానీ గత ఏడాది నుండి పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీలోని అందరికీ అంటే చిరంజీవి దగ్గర నుండి అల్లు అర్జున్ వరకు అందరికీ దగ్గరవుతున్నారు. పొలిటికల్ కెరీర్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అవకాశం ఉన్నప్పుడల్లా చిరజీవి ఇంటికెళ్లి వస్తున్నాడు. అనేక అకేషన్స్ కి పవన్ భార్యతో పాటుగా హాజరవుతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ కి ఇంతకన్నా ఏం కావాలి. ఇక రామ్ చరణ్ ఎప్పుడూ బాబయ్ పవన్ కళ్యాణ్ కి దగ్గరగానే ఉంటున్నాడు.

సై రా సెట్ కి వచ్చిన పవన్ కళ్యాణ్

మొన్నటికి మొన్న చిరు పుట్టిన రోజుకి పవన్ కళ్యాణ్ సతీసమేతంగా అన్న ఇంటికి వెళ్లాడు. ఇక ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్ ఒకే ఫ్రెమ్ లో ఒకే చోట కలిసి కనబడితే మెగా ఫ్యాన్స్ ఆనందనడానికి హద్దులే ఉండవు. మరి ఇప్పుడు నిజంగానే అలాంటి హ్యాపీ మూమెంట్ ఒకటి సై రా నరసింహారెడ్డి సెట్స్ లో చోటు చేసుకుంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న సై రా మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటున్న చిరంజీవిని కలిసేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సై రా సెట్స్ కి విచ్చేయడం… సై రా షూటింగ్ కోసం బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఉండడం… నిర్మాతగా రామ్ చరణ్ అక్కడే ఉండడం తో చిరు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్ కలిసి ఒక ఫోటోకి ఫోజిచ్చారు. అయితే ఆ ఫోటోలో రైటర్ సత్యానంద్ కూడా ఉన్నాడు.

కానుకగా ఇచ్చిన చిరంజీవి…

మరి ఆ ఫోటోని సత్యానంద్ కోసం చిరంజీవి ఫోటో ఫ్రెమ్ కట్టించి పంపినట్లుగా.. అందుకే అంత అపురూపమైన ఫోటోని సత్యానంద్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ ఫొటోలో చిరంజీవి సై రా నరసింహారెడ్డి గెటప్ లో అదరగొడుతుంటే.. రామ్ చరణ్, పవన్ లాల్చీ పైజామాతో.. అమితాబ్ బచ్చన్ సై రా గురువు గెటప్ లో ఉన్నారు. మరి ఆ ఫోటో చూస్తుంటే నిజంగా మెగా ఫాన్స్ కి మాత్రమే అందరికీ పండగ లాంటిదే. ఒకే ఫ్రెమ్ లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ ఉంటే మరి చూసేవారికి పండగేగా. ఈ ఫోటో ఎప్పుడు తీసింది అనేది ఇంపార్టెంట్ కాదుగానీ.. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సత్యానంద్ ని అందరూ తెగ మెచ్చేసుకుంటున్నారు.