ప‌వ‌న్ కోసం అనుకుంటే ఎన్టీఆర్ తోనా..

గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ కోబలి అనే సినిమా తియ్యాలని కంకణం కట్టుకున్నాడనే ప్రచారం మామూలుగా జరగలేదు. అయితే ఎప్పుడు ఆ కోబలి సినిమా విషయమై అటు పవన్ కళ్యాణ్ గాని, ఇటు త్రివిక్రమ్ గాని స్పందించలేదు. అయితే జల్సా, అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ -పవన్ కళ్యాణ్ ల స్నేహ బంధం ఫెవిక్విక్ లా అతుక్కుపోయింది. అయితే అత్తారింటికి దారేది తర్వాత పవన్ – త్రివిక్రమ్ కాంబోలో కోబలి వస్తుంది అనుకుంటే… నాలుగేళ్ల‌ గ్యాప్ త‌ర్వాత‌ పవన్, త్రివిక్రమ్‌ కలిసి అజ్ఞాతవాసి అనే డిజాస్టర్ మూవీ చేశారు. ఇక అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ స్నేహ బంధానికి బీటలు వారాయనే ప్రచారం జోరుగా మొదలైంది.

ఎన్నిక‌ల‌తో కుద‌ర‌లేదు…

అయితే అవన్నీ నిజమో కాదో తెలియదు గాని.. త్రివిక్రమ్ మాత్రం పవన్ హీరోగా కోబలి సినిమా చెయ్యాలనుకున్న మాట వాస్తవమే అట. అదే విషయాన్నీ త్రివిక్రమ్ తాజా ఇంటర్వ్యూ లో బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్ తో కోబలి చేయాలనుకున్నది నిజమే అని…ఆ సినిమా కి టైటిల్ కూడా పెట్టామని… శత్రువుల ఫై దాడి చేస్తున్నప్పుడు కసి కోసం కోరు బలి, నరుకు బలి అని గట్టిగా అరుస్తారని అందుకే ఆ టైటిల్ కోబలి గా ఖరారు చేసానని సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయిందని కెమెరామెన్ ని కూడా తీసుకున్నామన్నాడు. కానీ అప్పట్లో 2014  ఎన్నికల కారణంగా ఆ సినిమా చేయలేకపోయామని చెబుతున్నాడు త్రివిక్రమ్. ఇక ఆ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో చెయ్యాలనుకున్నామని కూడా చెప్పాడు త్రివిక్రమ్.

ఇప్పుడు ఎన్టీఆర్ కు క‌లిసొస్తుంది..

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో తీస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా పవన్ కి అనుకున్న కోబలి కథ కాకపోయినా… కోబలి కోసం రాయలసీమ కి సంబందించిన గ్రౌండ్ వర్క్ చెయ్యడంతో.. ఇపుడు అదే రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉన్న కథని ఎన్టీఆర్ కోసం తీసుకోవడంతో కోబలి కోసం చేసిన గ్రౌండ్ వర్క్ ని అరవింద సమెత కి ఉపయోగిస్తున్నట్టుగా త్రివిక్రమ్ స్పష్టం చేసాడు. అదన్నమాట పవన్ కోబలి కథ ఎన్టీఆర్ అరవింద సమేత కి వదలేదన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*