టాలీవుడ్ ని బాగా వాడేసుకుంటుంది

అల్లు అర్జున్ ‘డీజే’ చిత్రంతో ఊహించని ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే…అంతకుముందు వరుణ్ తేజ్ మొదటి సినిమా ‘ముకుంద‌’.. నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు రాకపోయినా.. ‘డీజే’తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. బాలీవుడ్ లో హృతిక్ స‌ర‌స‌న న‌టించిన ‘మొహంజోదారో’ తేలేని కొత్త ఇమేజ్‌ని ‘డీజే’ తెచ్చింది ఈ భామకు.

అందుకే ఆమె టాలీవుడ్ లో సెటిల్ అయ్యి తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తుంది. లేటెస్ట్ గా ఈమె బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న ‘సాక్ష్యం’ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతుంది. అయితే ఈమె ఆ సినిమా కోసం కోటి రెమ్యున‌రేష‌న్ తీసుకుందంట. ఆమె అడిగిన అంత నిర్మాతలు ఇచ్చారని టాక్.

ఇకపోతే ఈమె ఎన్టీఆర్ సరసన ‘అర‌వింద స‌మేత‌’తో పాటు.. చరణ్ – బోయపాటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు రాధా కృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ చేయబోయే సినిమాలో కూడా పూజ ని సెలెక్ట్ చేసారంట. ఇలా పెద్ద సినిమాల్లో నటిస్తూనే యంగ్ హీరోస్ స‌ర‌స‌న అవ‌కాశాల్ని ప‌రిశీలిస్తోందిట‌. త‌న వ‌ర‌కూ భారీ పారితోషికం ముడితే పూజా న‌టించేందుకు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌డం లేద‌ని తెలుస్తోంది. పెద్ద హీరోలు సినిమాలు అంటే ఎలాగో భారీగానే ముడుతోంది కాబట్టి యువ‌హీరోల సినిమాల్లో కూడా అంతే తీసుకోవాలని అనుకుంటుందంట. అయితే వాళ్లతో సినిమా చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయ‌ని చెప్పుకుంటున్నారు. మొత్తానికి పూజ టాలీవుడ్ ని బాగానే వాడుకుంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*