పూజ హెగ్డే రేంజ్ చూశారా..?

ప్రస్తుతం టాప్ హీరోలతో, టాప్ సినిమాలు చేస్తూ హీరోయిన్ పూజ హెగ్డే మంచి పొజిషన్ లో కొనసాగుతుంది. ఇండస్ట్రీలో ఒక్క సినిమా తేడా వచ్చిందా… మరో సినిమా విషయంలో ఆ హీరోయిన్ కి ఎలాంటి క్రేజ్ ఉండదు. ఇక ఒక్క సినిమా హిట్ అయ్యిందా… ఆ హీరోయిన్ కి వరస అవకాశాలే కాదు.. స్టార్ హీరోల కన్ను ఆమె మీదే ఉంటుంది. డీజే సినిమా హిట్ కాకపోయినా.. పూజ గ్లామర్ కి పడిపోయిన దర్శకనిర్మాతలు.. పూజ హెగ్డే కి వరసగా పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలిచ్చేశారు. ఎన్టీఆర్ అరవింద సమేతలో, మహేష్ మహర్షిలో, ప్రభాస్ 20వ చిత్రంలో పూజ హెగ్డేనే హీరోయిన్. ముగురు స్టార్ హీరోల సినిమాల్లో ఒకేసారి షూటింగ్ లో పాల్గొంటూ డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ పూజ దూసుకుపోతుంది.

హిట్ లేకున్నా స్టార్ హీరోల సరసన…

అరవింద సమేత షూటింగ్ లో పూజ సీన్స్ ఎప్పుడో పూర్తికావలసి ఉంది. ఎన్టీఆర్ తో కలిసి నటించే సీన్స్ కొన్ని వాయిదా పడడం.. ఈలోపు పూజ హెగ్డే బాలీవుడ్ సినిమాలోనూ నటించాల్సి రావడం.. ఇప్పుడు పూజ కి ఊపిరి సలపని పని అయ్యింది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ సినిమాల షూటింగ్స్ తో నలిగిపోతున్న పూజ హెగ్డే ఇప్పుడు బాలీవుడ్ లో హౌస్‌ఫుల్ 4 తో బాగా బిజీగా మారిపోయింది. అరవింద సమేతకి ఎన్టీఆర్ తండ్రి మరణంతో కొద్ది రోజుల షూటింగ్ కి బ్రేక్ రావడం.. అది ఇప్పుడు షెడ్యూల్ కావడం, అలాగే మహర్షి షూటింగ్, ప్రభాస్ 20వ సినిమా షూటింగ్ లో బిజీగా మారిన పూజ ఇపుడు హౌస్‌ఫుల్ 4 షూటింగ్ కి కూడా జాయిన్ కావడంతో.. హైదరాబాద్ నుండి ముంబై.. ముంబై నుండి హైదరాబాద్ కి ఫ్లైట్ ఎక్కిదిగుతోంది.

ఏది హిట్ అయినా…

ఒకపక్క అరవింద సమేత బ్యాలెన్స్ సీన్స్ షూటింగ్ హైదరాబాద్ లో, మరోపక్క జైసల్మేర్‌లో జరుగుతున్న హౌస్‌ఫుల్ 4 షూటింగ్ కోసం చార్టెడ్ ఫ్లైట్ ‌లో పయనిస్తోంది పూజ హెగ్డే. జైసల్మేర్ కి హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు అంతగా లేకపోవడం వల్లే, సమయం వృథా కాకూడదన్న ఉద్దేశంతో పూజ ఇలా ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తోందట. మరి దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా… టాలీవుడ్, బాలీవుడ్ లలో సూపర్ హిట్స్ లేని పూజ హెగ్డేకి ఇప్పుడు నటిస్తున్న పెద్ద ప్రాజెక్టులలో ఏది హిట్ అయినా అమ్మడు టాప్ చైర్ కి దగ్గరై పోవడం ఖాయమంటున్నారు.