అదృష్టం పట్టింది… అవస్థ పడుతుంది.

అల్లు అర్జున్ తో కలిసి డీజే సినిమాలో అందాలు ఆరబోసిన పూజ హెగ్డే కి టాలీవుడ్లో తిరుగులేని అదృష్టం పట్టుకుంది. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సరసన ఒకేసారి ఛాన్స్ కొట్టేసిన పూజ కి లక్కు బాగా కుదిరింది. డీజే లో బికినీ షో, గ్లామర్ షో పూజ కి అన్నివిధాలా కలిసొచ్చింది. అందుకే ఒకేసారిగా ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి స్టార్స్ తో నటించడానికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మరి ముగ్గురు స్టార్స్ టాలీవుడ్ టాప్ స్టార్స్ కావడం.. ఎన్టీఆర్ తో డాన్స్ లతో చితక్కొట్టి క్రేజ్ కొట్టేయడం, మహేష్ తో నటించి మంచి పేరు తెచ్చుకోవడం.. ప్రభాస్ తోకలిసి మూడు భాషల్లోకి ఒక్కసారిగా వెళ్లిపోవడం తో పూజ హెగ్డే అదృష్టానికి అందరూ కుళ్ళుకుంటున్నారు.

అయితే పూజ కి అదృష్టమైతే పట్టింది కానీ బాగా అవస్థలు పడుతుంది. నిన్నమొన్నటి వరకు ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్ తో బిజీగా వున్న పూజాహెగ్డే జులై నుండి మహేష్ మహర్షి షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. అరవింద షూటింగ్ మహేష్ మహర్షి షూటింగ్ కోసం హైదరాబాద్, డెహ్రాడూన్ సర్వీస్ చేసిన పూజ హెగ్డే ఇప్పుడు ప్రభాస్ – రాధాకృష్ణ కాంబోలో వస్తున్న మూవీ కోసం కూడా రెడీ అయ్యింది. రెడీ అవడమే కాదు… ప్రభాస్ 20 సినిమా షూటింగ్ లో అప్పుడే జాయిన్ కూడా అయ్యింది. రాధాకృష్ణ డైరెక్షన్ లో తాజాగా ప్రభాస్ 20 మొదలైంది. అయితే రెగ్యులర్ షూటింగ్ కూడా నిన్న శనివారం నుండే మొదలైపోయింది.

ఇక నిన్న శనివారం పూజ హెగ్డే షూటింగ్ షెడ్యూల్ చూస్తే మాత్రం అమ్మో.. పూజ ఎంతగా అవస్థ పడుతుందో అనేస్తారు. ఎందుకంటే నిన్న ఉదయం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న అరవింద సామెత కోసం పూజ ఓన్ డబ్బింగ్ మొదటిసారిగా చెబుతుంది. అయితే అరవింద సినిమా డబ్బింగ్ కోసం శనివారం ఉందయం వచ్చిన పూజ…. మహేష్ మహర్షి షూటింగ్ లో మద్యాన్నం జాయిన్ అయ్యింది. వంశి పైడిపల్లి – మహేష్ కాంబోలో వస్తున్న మహర్షి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఇక ఉదయం అరవింద డబ్బింగ్, మధ్యాన్నం మహర్షి షూటింగ్.. ఇక రాత్రి అయ్యేసరికి ప్రభాస్ 20 వ సినిమా షూటింగ్ సెట్స్ కి వచ్చేసింది. జిల్ రాధాకృష్ణ ప్రభాస్ 20 ని మొదలుపెట్టేసి ముందుగా హీరోయిన్ మీద కొన్ని సీన్స్ షూట్ చెయ్యడంతో.. పూజ ఇలా ముగ్గురు హీరోల మధ్యన ఇరుక్కుపోయింది. అయితే ప్రభాస్ షూటింగ్ లో పూజ అయితే చేరింది కానీ.. ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతాడో సమాచారం లేదు. ఇకపోతే పూజ హెగ్డే కి అదృష్టం అయితే పట్టింది కానీ.. అవస్థ తప్పడలేదంటున్నారు పూజ సన్నిహితులు. అయినా ఫెమ్ లోకి రావాలంటే ఆ మాత్రం కష్టపడాలిలే

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*