పూజా బాగా బుక్ అయ్యింది..!

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’.. మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న మహేష్ 25 చిత్రం.. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ పూజా హెగ్డేయే కావడం విశేషం. ఈ రెండు సినిమాలు హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

రెండు సెట్స్ మీద చక్కర్లు కొడుతున్న పూజా

ఈ రెండింట్లో పూజా హెగ్డే మీద సన్నివేశాలు తీసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారంట డైరెక్టర్స్. దీంతో పూజ అటు ఎన్టీఆర్ సినిమాతో పాటు.. ఇటు మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతుందంట. ఎవరి సినిమాకీ నో చెప్పలేని పరిస్థితి. దీంతో రెండు సినిమాల సెట్స్ మధ్య పూజా హెగ్డే చక్కర్లు కొట్టింది. ఒక సెట్ లో సీన్ కంప్లీట్ అవ్వగానే మరో సెట్ కు వెళ్లి ఇంకో సీన్ చేస్తూ బిజీ అయిపోయిందంట.

గతంలో ఇలా చేసినా…

గతంలో హీరో హీరోయిన్లు ఇదే విధంగా షూటింగ్ చేసేవారు. రోజుకి రెండు మూడు షిఫ్టులు లెక్కన పని చేసేవారు. ఆ తర్వాత టెక్నాలజీ పెరగడంతో షాట్స్ తీయడం ఆలస్యం అవుతుంది. అందుకే ఇప్పుడు మన హీరోలు ఒకొక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి మాత్రం ఆలా లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*