ప్రభాస్ కు క్లాస్ పీకడానికి దుబాయ్ వెళ్లిన అనుష్క!

టాలీవుడ్ లో హిట్ పెయిర్ ఎవరు అని అడిగితే వెంటనే ప్రభాస్ – అనుష్క అంటారు. వీరి జోడియే కాదు, వీరు చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. ‘మిర్చి’, ‘బాహుబలి’ తదితర సినిమాల్లో వీరిద్దరి జోడీ అభిమానులను ఎంతగానో అలరించింది. ఇక ప్రభాస్ లేటెస్ట్ గా ‘సాహో’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

క్లాస్ తీసుకున్న అనుష్క..

ఈ సినిమా షూటింగ్ నెల రోజుల నుంచి దుబాయ్ లో జరుపుకుంటుంది. దుబాయ్ లో యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించాలన్న ఉద్దేశంతో రూ. 90 కోట్లతో ఫైట్ సీన్ ను చిత్రీకరించారని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రభాస్ ఈ యాక్షన్ సీన్స్ కోసం కంప్రమైజ్ కాకుండా రియాల్టీ కోసం డూప్ లేకుండా ప్రభాస్ షూటింగ్ చేశారు. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ప్రభాస్ కు రెండు సార్లు గాయాలు అయ్యాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న అనుష్క వెంటనే దుబాయ్ వెళ్లి ప్రభాస్ కు క్లాస్ తీసుకుందట. డూప్ లేకుండా రిస్కీ షాట్లు చెయ్యొద్దని, ఏదైనా జరిగితే అభిమానులు ఎంతో బాధపడతారని నచ్చజెప్పిందట.

డూప్ పెట్టుకుంటానన్న ప్రభాస్…

ప్రభాస్ కూడా డూప్ ని పెట్టుకుంటానని ప్రామిస్ కూడా చేశాడని సమాచారం. అయితే గత కొన్ని రోజులు నుండి ప్రభాస్ – అనుష్కల పెళ్లి గురించి వార్తలు వస్తుంటే అనుష్క అవి ఏమి పట్టించుకోకుండా తన బెస్ట్ ఫ్రెండ్ ని కలవటానికి వెళ్లింది. మరి ఆ వార్తలు నిజం కాదని ఇద్దరూ ఖండిస్తేనే కానీ ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడదు.