ప్రభాస్ తో స్వీటీ పెళ్లి నిజమేనా?

ప్రస్తుతం ‘సాహో’ మూవీకి సంబంధించి దుబాయ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న ప్రభాస్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ప్రభాస్ – అనుష్క ల పెళ్లి దాదాపు ఫిక్స్ అయ్యిపోయిందనే టాక్ నడుస్తోంది. గతంలో ఈ వార్తపై ఇటు ప్రభాస్ అటు అనుష్క ఇద్దరూ క్లారిటీ ఇచ్చినప్పటికీ మళ్లీ ఇప్పుడు వచ్చిన ఈ వార్తపై మాత్రం ఎటువంటి స్పందన లేదు. ప్రభాస్ దుబాయ్ లో నెల రోజులుపై ఉంటున్నా రెగ్యులర్ గా అనుష్క తో టచ్ లో ఉన్నట్టు టాక్.

అన్ని ఫిక్స్ అయ్యకే చెబుతారా..?

ఇద్దరి మధ్య ప్రేమ బలంగా ఉందని పైకి చెప్పకుండా అన్ని సెట్ చేసుకున్నాక ఆ తర్వాత మీడియాకి ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లుగా మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. గతంలో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఈ వార్తలని ఖండించాడు. కానీ, దాని తర్వాత ప్రభాస్ పెళ్లి విషయంలో మళ్లీ ఎక్కడా నోరు విప్పలేదు.

ఎవరోఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే…

అనుష్క కూడా బాహుబలి 2 తర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదు. దానికి కారణం పెళ్లికి సుముఖంగా ఉండటమే అని సన్నిహితుల నుంచి సమాచారం. గోపీచంద్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినా అది ప్రస్తుతానికి నిరాధారమే. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ప్రభాస్ లేదా స్వీటీ కానీ మరోసారి ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాలి. ఇద్దరూ ఇప్పటికి కూడా స్పందించకపోతే ఈ వార్తల్ని నిజం అనుకునే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*