ప్రభాస్ ఒక జెంటిల్మెన్ అంటున్న హాట్ బ్యూటీ..!

ప్రభాస్ ‘బాహుబలి’ సిరీస్ తర్వాత నటిస్తున్న ‘సాహో’ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత ఈ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ తో పాటు ఇంకొంతమంది హిందీ నటీ నటులు నటిస్తున్నారు. వీరిలో బాలీవుడ్ బామ్మ ఎవెలిన్ శర్మ కూడా ఒకరు. రీసెంట్ గా జరిగిన దుబాయ్ షెడ్యూల్లో ఆమె యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు.

ప్రభాస్ ను ఆకాశనికెత్తింది…

ఈ నేపథ్యంలో ఆమె ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ… ” ప్రభాస్ ఒక జెంటిల్మెన్ అని కితాబిచ్చారు. అంతేకాదు ప్రభాస్ తో ఒకసారి మాట్లాడితే చాలు ఆయన ఎలాంటి మొహమాటం, బిడియం లేకుండా మాట్లాడతారని చెప్పారు. ప్రభాస్ తో కలిసి నటిచడం చాలా ఆనందంగా ఉంది” అని ఆమె అన్నారు. యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని 2019 వేసవికి విడుదల చేయనున్నారు. అయితే నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పటి నుండి అనే విషయం తెలియాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*