మూడు భాషల్లో ప్రభాస్ చిత్రం..!

బాహుబలి సీజన్ తర్వాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో సాహో సినిమాలో నటిస్తున్నాడు. దేశంలోని పలు భాషల్లో తెరకెక్కుతున్న సాహో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమాని భారీ హైప్ తో, భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపొతే ఈ సినిమాతో పాటు ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాని మొదలు పెట్టబోతున్నాడు అంటూ చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. కానీ సినిమా మాత్రం ఇంకా మొదలవ్వలేదు. ఇంకా ఈ సినిమాని రాధాకృష్ణ ఈ ఏడాది మొదలు పెట్టి వచ్చే ఏడు సంక్రాతి కల్లా పూర్తి చేసి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడని అన్నారు.

మళ్లీ పూజనే

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న పూజ హెగ్డే నటిస్తుందని అన్నారు. కానీ ఈ విషయమై ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ప్రభాస్ రాధాకృష్ణ మూవీ పై క్లారిటీ ఇచ్చేసాడు. తన 20వ చిత్రాన్ని జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ రోజు గ్రాండ్ గా మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఈ ఓపెనింగ్ కి అగ్ర దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా రానున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని తాను రాధాకృష్ణ దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్నానని… ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనుందని.. ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారని ప్రభాస్ చెప్పాడు.

హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చిన

ఈ చిత్రంలో తనకి జోడిగా పూజ హెగ్డే నటిస్తుందని ప్రభాస్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. మరి సాక్ష్యం సినిమా ప్లాప్ తర్వాత ప్రభాస్ తో పూజ నటించడం కష్టమనే న్యూస్ నడిచింది. అంతలోపే ప్రభాస్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని ప్రచారం జోరుగా జరగడం.. మధ్యలో పూజ హేగ్డే కి ఫోటో షూట్ నిర్వహస్తున్నారని.. ప్రభాస్ పక్కన ఓకె అయితే ఓకె అని లేదంటే మరో హీరోయిన్ ప్రభాస్ కి జోడిగా వస్తుందన్నారు. కానీ ఫైనల్ గా ప్రభాస్ ఇచ్చిన క్లారిటీతో ఈ సినిమాలో పూజ హెగ్డేనే హీరోయిన్ గా ఖరారైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*