ప్రభాస్ లుక్ నార్మల్ గానే ఉంది!!

ఈనెల 28 తో బాహుబలి 2 రిలీజ్ అయ్యి ఏడాది అవుతుంది. కానీ ప్రభాస్ సాహో మాత్రం ఇంకా 50 శాతం కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. బాహుబలి లానే ఈ సినిమాకి కూడా ఎక్కువ సమయం తీసుకున్నట్టు అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమా హిందీ రైట్స్ 120 కోట్లకు అమ్ముడైందని టాక్ వినిపిస్తుంది.

టీజర్ ను లాంచ్ చేయడంతో…

ఇంతగా హైప్ ఉన్న సాహో కోసం ప్రభాస్ చాలానే కష్టపడుతున్నాడని..తన లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంత అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ప్రభాస్ లుక్ బయటికి వచ్చింది. తమిళ్ సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ ఆ సినిమా తెలుగు టీజర్ ను లాంచ్ చేసాడు. ఆ సమయంలో కెమేరా కళ్లకు దొరికిపోయాడు. అందరూ అనుకున్నట్టు ప్రభాస్ లుక్ ఏం మాత్రం కొత్తగా లేదు అని తెలిసిపోతోంది.. బాహుబలితో పోల్చుకుంటే కొంచం లావు తగ్గినట్టు అనిపిస్తుంది. అంతే తప్ప.. తన లుక్ విషయంలో చేసిన మార్పులు ఏమీ లేవు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1