అయ్యో.. అవునా… ప్రభాస్ పెళ్లి అందుకే లేట్ అవుతుందా..?

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ ఎవరంటే వెంటనే ప్రభాస్ అనేస్తాం. ప్రభాస్ కు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతను ఊ.. అంటే చేసుకోడానికి బయట నుండే కాదు ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది హీరోయిన్స్ పోటీ పడతారు. ఇండియా వైడ్ పాపులర్ అయినా ప్రభాస్ కు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్కపోవడం ఆశ్చర్యకరమే.

పెళ్లి విషయంలో కృష్ణంరాజుపై ఒత్తిడి…

కానీ వివరాల్లోకి వెళ్తే ప్రభాస్‌ ఇంట్లో క్యాస్ట్‌ పట్టింపులు ఎక్కువ అవడంతో సరైన అమ్మాయి దొరకడం లేదంట. ప్రభాస్ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజికవర్గం వారు ప్రభాస్ ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. ప్రభాస్ చేసుకుంటే క్షత్రియ కులానికి చెందిన అమ్మాయినే చేసుకోవాలి క్షత్రియ సంఘాలు కృష్ణంరాజుపై ఒత్తిడి తెస్తున్నాయట.

ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే…

అందుకే ప్రభాస్ తనకు ఇష్టమైన ఇద్దరు హీరోయిన్స్ ని పక్కన పెట్టేసాడని టాక్. ఇదిలా ఉంటే తమ సామాజిక వర్గం నుంచి ప్రభాస్‌కి సూటయ్యే అమ్మాయి దొరకడం లేదట. కొన్ని పెద్ద కుటుంబాలాకి చెందిన అమ్మాయిలు ఉన్నారు కానీ సినిమా హీరోతో సంబంధాన్ని సదరు కుటుంబాలు కోరుకోవడం లేదట. కొన్ని సంబంధాలు ప్రభాస్ ఫ్యామిలీకి నచ్చడం లేదంట. అన్నీ కుదిరితే ఈ ఏడాదే ప్రభాస్ పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ ఇంకా ఏది సెటిల్ అయ్యే పరిస్థితిల్లో లేవు. కాబ్బటి ప్రభాస్ పెళ్లికి ఇంకా టైం పెట్టె అవకాశం ఉంది. అంటే ఇంకొన్నాళ్ళు ప్రభాస్ బ్యాచ్‌లర్‌ గా ఉండాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*