ప్రభాస్ గొప్ప మనసు

return gift to prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. సాహో చిత్రంతో తీరిక లేకుండా బిజీగా ఉన్న అతడు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి అభిమానిని కలిశాడు. మదన్ అనే చిన్నారి ప్రభాస్ కు అభిమాని. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ‘‘నాకు బాహుబలిని కలవాలని ఉంది’’ అని రాసిన ప్లకార్డు పట్టుకుని ఆసుపత్రిలో తల్లిదండ్రులతో కలిసి మదన్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం ప్రభాస్ దృష్టికి వచ్చింది. దీంతో ప్రభాస్ వెంటనే మదన్ ను కలిసి కొంత సేపు అతడితో ఉత్సాహంగా గడిపాడు. ఈ విషయాన్ని బీఏ రాజు ట్విట్టర్ లో పంచుకున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*